ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు‌.. డిగ్రీ అర్హత ఉంటే చాలు..వెంటనే అప్లయి చేసుకోండీ..

By S Ashok KumarFirst Published Dec 18, 2020, 3:04 PM IST
Highlights

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25 పోస్టుల్ని భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2020-21 నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) 02/2021 బ్యాచ్ (ఎస్ఆర్డి) కింద జనరల్ డ్యూటీ బ్రాంచ్ కోసం అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ‘ఎ’ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టుల నియామక నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25 పోస్టుల్ని భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ 21 డిసెంబర్ 2020 నుండి ప్రారంభంమై 27 డిసెంబర్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.joinindiancoastguard.gov.in/ చూడొచ్చు.

వచ్చే ఏడాది జనవరి 20 నుండి ఫిబ్రవరి 20 వరకు తాత్కాలికంగా జరగాల్సిన ప్రిలిమినరీ సెలక్షన్ టెస్ట్ కోసం విజయవంతమైన దరఖాస్తుదారులను పిలుస్తారు. ఎజిమాలాలోని ఐఎన్‌ఎలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ శిక్షణ జూన్ 2021 చివరిలో ప్రారంభం కానుంది.  

విద్యార్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ లేకపోతే జనరల్ డ్యూటీ పోస్టులకు అర్హులు కాదు.

వయస్సు: 1996 జూలై 1 నుంచి 2000 జూన్ 30 మధ్య జన్మించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: దరఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేసి ప్రిలిమినరీ సెలక్షన్‌కు పిలుస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 21, 2020
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 27, 2020
అడ్మిట్ కార్డ్ విడుదల: ఫిబ్రవరి 6, 2020
ప్రిలిమినరీ ఎగ్జామ్: 20 జనవరి నుంచి 20 ఫిబ్రవరి 2021
ఫైనల్ సెలక్షన్: ఫిబ్రవరి 2021 చివరి వారం నుంచి ఏప్రిల్ వరకు
పరీక్ష కేంద్రాలు: ముంబయి, చెన్నై, కోల్‌కతా, నోయిడా.
వెబ్‌సైట్‌:https://www.joinindiancoastguard.gov.in/


వయో పరిమితి: 01 జూలై 1996 నుండి 30 జూన్ 2000 మధ్య జన్మించి ఉండాలి.

అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ) - 25 పోస్టులు
ఎస్‌సి  - 5 పోస్టులు
ఎస్‌టి - 14 పోస్ట్లులు
ఓ‌బి‌సి - 6 పోస్ట్లులు


ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పే స్కేల్:
అసిస్టెంట్ కమాండెంట్-  రూ.56,100.00  
డిప్యూటీ కమాండెంట్-  రూ.67,700.00  
కమాండెంట్ (జెజి) -  రూ.78,800.00 
కమాండెంట్-  రూ.1,18,500.00 రూ. 
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్-  రూ.1,31,100.00  
ఇన్స్పెక్టర్ జనరల్-  రూ.1,44,200.00 
అదనపు డైరెక్టర్ జనరల్-  రూ.1,82,200.00  
డైరెక్టర్ జనరల్-  రూ.2,05,400.00  

click me!