పరీక్ష లేకుండా హైద‌రాబాద్‌ ఇసిఐఎల్ లో ఉద్యోగాలు‌.. డిసెంబర్ 31లోగా ధరఖాస్తు చేసుకోండీ..

Ashok Kumar   | Asianet News
Published : Dec 16, 2020, 05:52 PM IST
పరీక్ష లేకుండా హైద‌రాబాద్‌ ఇసిఐఎల్ లో ఉద్యోగాలు‌.. డిసెంబర్ 31లోగా ధరఖాస్తు చేసుకోండీ..

సారాంశం

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన అటామిక్ ఎన‌ర్జీ విభాగానికి చెందిన‌ ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ‌(ఈసీఐఎల్‌).. ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్)లో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్), డిప్యూటీ జనరల్ మేనేజర్ కార్పొరేట్ కమ్యూనికేషన్ (సిసి), డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ కార్పొరేట్ పర్చేజ్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల కోసం ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2020 కోసం అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.inలో డిసెంబర్ 09 నుండి 2020 డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఒక్కో పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు.

also read వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

మొత్తం ఖాళీలు: 15
పోస్టులు: సీనియ‌ర్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, డిప్యుటీ మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్ త‌దిత‌ర పోస్టులున్నాయి.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేష‌న్‌, పీజీ(హెచ్ఆర్‌/ ఐఆర్‌/ పీఎం, లా, మాస్‌క‌మ్యునికేష‌న్/ జ‌ర్న‌లిజం), ఎంబీఏ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ సీఎంఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక చేసే విధానం: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపికలు  ఉంటాయి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
ADDITIONAL GENERAL MANAGER & IN-CHARGE, 
HR PERSONNEL GROUP, ADMINISTRATIVE OFFICE, 
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, 
ECIL (POST), HYDERABAD – 500 062, TELANGANA.

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్