కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) 145 ఇంజినీరింగ్ ట్రైనీ(మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్), ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్(హెచ్ఆర్, ఫైనాన్స్) పోస్టులకు భారత పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) 145 ఇంజినీరింగ్ ట్రైనీ(మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్), ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్(హెచ్ఆర్, ఫైనాన్స్) పోస్టులకు భారత పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 16, 2019 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
దరఖాస్తులకు చివరి తేదీ మే 06, 2019, 11.45గంటలు కాగా, ఫీజు చెల్లించే చివరి తేదీ మే 08.
undefined
పోస్టుల వివరాలు: ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్
సంస్థ: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్)
విద్యార్హత: బీఈ/బీటెక్ డిగ్రీ: బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ/డిప్లొమా: సీఏ/సీడబ్ల్యూఏ
అనుభవం: ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
జీతం: నెలకు రూ. 50,000-1,60,000
ఇండస్ట్రీ: ఎలక్ట్రికల్
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 16, 2019
దరఖాస్తులకు చివరి తేదీ: మే 6, 2019
వయో పరిమితి: దరఖాస్తు చేసుకునే ఇంజినీరింగ్ ట్రైనీ అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 01, 2019 నాటికి 28ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అభ్యర్థుల వయస్సు 29ఏళ్లకు మించరాదు.
ఓబీసీలకు మూడేళ్ల సడలింపు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంది. UR/EWS/OBC అభ్యర్థులు రూ. 500, అప్లికేషన్ కమ్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 300(జీఎస్టీ అదనం) ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్టీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, మాజీ ఎస్ఎం అభ్యర్థులు రూ. 300(జీఎస్టీ అదనం) చెల్లించాలి.
విభాగాల వారీగా పోస్టుల సంఖ్య:
మెకానికల్: 40
ఎలక్ట్రికల్: 30
సివిల్: 20
కెమికల్: 10
హెచ్ఆర్: 20
ఫైనాన్స్: 25
మొత్తం: 145
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) మే 25న, ఇంటర్వ్యూ మే 26, 2019న జరుగనుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడి క్లిక్ చేయండి.