వెబ్‌సైట్లో పంచాయతీ కార్యదర్శి హాల్ టికెట్లు: 21న పరీక్ష

By rajashekhar garrepally  |  First Published Apr 16, 2019, 3:51 PM IST

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-3 పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 21న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏపీపీఎస్సీ సోమవారం(ఏప్రిల్ 15) నుంచి అందుబాటులో ఉంచింది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-3 పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 21న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏపీపీఎస్సీ సోమవారం(ఏప్రిల్ 15) నుంచి అందుబాటులో ఉంచింది. 

అవసరమైన వివరాలు సమర్పించి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లు అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 21న స్క్రీనింగ్ పరీక్ష, ఆగస్టు 2న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 

Latest Videos

undefined

మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ లేదా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు(పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 75 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ సమస్యలు, ఏపీకి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్ష ఉంటుంది.

కాగా, మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబర్ 19 నుంచి జనవరి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడి క్లిక్ చేయండి

click me!