ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబల్యూఈఎస్) ఇంగ్లీష్, హిందీ, సంస్కృత, చరిత్ర, భౌగోళిక, ఆర్థిక శాస్త్రాలతో సహా వివిధ విభాగాలలో పిజిటి, టిజిటి, పిఆర్టి ఉపాధ్యాయుల కోసం అర్హత, ఆసక్తిగల అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది.
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషన్లలో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి నియామక ప్రాథమిక పరీక్షా (ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2020)ద్వారా ప్రకటన విడుదలైంది.
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబల్యూఈఎస్) ఇంగ్లీష్, హిందీ, సంస్కృత, చరిత్ర, భౌగోళిక, ఆర్థిక శాస్త్రాలతో సహా వివిధ విభాగాలలో పిజిటి, టిజిటి, పిఆర్టి ఉపాధ్యాయుల కోసం అర్హత, ఆసక్తిగల అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది.
undefined
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1న ప్రారంభమై 20 అక్టోబర్ 2020న సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తుంది. నవంబర్ 21, 22 తేదీల్లో ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ కోసం http://aps-csb.in/College/Index_New.aspx చూడవచ్చు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సంబంధిత పాఠశాలలు విడుదల చేసే ప్రకటనను అనుసరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలు తదుపరి నియామక ప్రక్రియ (ఇంటర్వ్యూ, బోధనా నైపుణ్యాల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ) ద్వారా ఖాళీలను భర్తీ చేస్తాయి.
మొత్తం ఖాళీలు: 8000
పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/ రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సీటెట్/ ఆయా రాష్ట్రాల టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉన్నవారికి గరిష్ఠ వయోపరిమితి 57 ఏళ్లు.
స్క్రీనింగ్ టెస్ట్ తేది: నవంబరు 21, 22
పరీక్షా కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 20 అక్టోబర్ 2020
అధికారిక వెబ్‌సైట్:http://aps-csb.in/