హైదరాబాద్ ఈపీఎఫ్ఓలో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండీ..

By Sandra Ashok Kumar  |  First Published Sep 24, 2020, 5:34 PM IST

ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) రిక్రూట్మెంట్ 2020 కోసం నవంబర్ 02 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న 27 పోస్టులను భర్తీ చేయడానికి ఇపిఎఫ్‌ఓ రిక్రూట్‌మెంట్ 2020 విడుదల చేసింది. 


ఇపిఎఫ్‌ఓ రిక్రూట్‌మెంట్ 2020: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఓ)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (విజిలెన్స్‌) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) రిక్రూట్మెంట్ 2020 కోసం నవంబర్ 02 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీగా ఉన్న 27 పోస్టులను భర్తీ చేయడానికి ఇపిఎఫ్‌ఓ రిక్రూట్‌మెంట్ 2020 విడుదల చేసింది. ఇందుకోసం ప్రభుత్వ సంస్థ ఇపిఎఫ్‌ఓ ఖాళీగా  ఉన్న 27 అసిస్టెంట్ డైరెక్టర్ (విజిలెన్స్) పోస్టులకు అర్హతగల  అభ్యర్ధుల దరఖాస్తు చేసుకోవాలని  కోరుతున్నారు.

Latest Videos

undefined

ఢీల్లీ, ముంబై, మహారాష్ట్ర, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, హైదరాబాద్, తెలంగాణలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ: 02 నవంబర్ 2020
ఇపిఎఫ్‌ఓ అసిస్టెంట్ డైరెక్టర్ (విజిలెన్స్) ఖాళీల వివరాలు

ప్రధాన కార్యాలయం (ఢీల్లీ): 05 పోస్టులు
ఉత్తర మండలం (ఢీల్లీ): 06 పోస్టులు
వెస్ట్ జోన్ (ముంబై): 05 పోస్ట్లులు
సౌత్ జోన్ (హైదరాబాద్): 05 పోస్ట్లులు
తూర్పు జోన్ (కోల్‌కతా): 06 పోస్ట్లులు

అర్హతలు: ఈపీఎఫ్ఓ ఆర్గ‌నైజేష‌న్ లేదా కేంద్ర ప్ర‌భుత్వం లేదా రాష్ట్ర ప్ర‌భుత్వం లేదా కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వ ఉద్యోగులై ఉండాలి. 

ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) రిక్రూట్మెంట్ 2020 కోసం దరఖాస్తు ఫార్మాట్ ద్వారా 2020 నవంబర్ 02 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును రీజినల్ ప్రావిడెంట్ శ్రీ బ్రిజేష్ కె. మిశ్రాకు పంపవచ్చు. 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆఫ్‌లైన్‌. నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి దానికి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత అడ్ర‌స్‌కు పంపించాలి. 

అడ్రస్
శ్రీ బ్రిజేష్ కె. మిశ్రా
ఫండ్ కమిషనర్ (హెచ్‌ఆర్‌ఎం), 
భవష్య నిధి భవన్, 
14 భికాజీ కామా ప్లేస్, 
న్యూ ఢీల్లీ -110066

వెబ్‌సైట్‌: https://www.epfindia.gov.in/site_en/Recruitments.php 

click me!