యుపిఎస్‌సి ఉద్యోగాల నోటిఫికేష‌న్‌ విడుదల.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

Ashok Kumar   | Asianet News
Published : Sep 26, 2020, 03:47 PM IST
యుపిఎస్‌సి ఉద్యోగాల నోటిఫికేష‌న్‌ విడుదల.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

సారాంశం

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 పోస్టులలో నియమకాలు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

న్యూఢిల్లీ:యుపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 పోస్టులలో నియమకాలు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

యుపిఎస్‌సి నోటిఫికేష‌న్ లో అసిస్టెంట్ ఇంజనీర్, ఫోర్‌మాన్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ సహ వివిధ పోస్టుల ఉన్నాయి.
 
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 15 అక్టోబర్ 2020
ఆన్‌లైన్ దరఖాస్తును ప్రింట్ చివరి తేదీ: 16 అక్టోబర్ 2020

యుపిఎస్‌సి రిక్రూట్మెంట్ 2020 ఖాళీ వివరాలు

అసిస్టెంట్ ఇంజనీర్ (క్వాలిటీ అస్యూరెన్స్) - 2 పోస్టులు
ఫోర్‌మాన్ (కంప్యూటర్ సైన్స్) - 2 పోస్టులు
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (కంప్యూటర్) - 3 పోస్టులు
 సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) - 2 పోస్టులు
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (మెకానికల్) - 10 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్ హెమటాలజీ) - 10 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఇమ్యునో-హెమటాలజీ ) - 5 పోస్ట్లులు
స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్ ఆంకాలజీ) - 2 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోనాటాలజీ) - 6 పోస్టులు

also read రైల్వేలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

అర్హ‌త‌లు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా అర్హ‌త‌లు నిర్ణయించారు. 

యుపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2020 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి
ఆసక్తి గల అభ్యర్థులు upsc.gov.in. లో ఆన్‌లైన్ పద్దతి ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తరువాత అభ్యర్థులు 16 అక్టోబర్ 2020 లోగా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటౌట్ తీసుకోవాలి.

యుపిఎస్‌సి రిక్రూట్మెంట్ 2020 దరఖాస్తు ఫీజు
జనరల్ / ఓబిసి / ఇడబ్ల్యుఎస్ పురుష అభ్యర్థులు- రూ. 25 / -
ఎస్సీ / ఎస్టీ / పిహెచ్ / మహిళా అభ్యర్థులు - ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
Success Story : సర్కార్ సాయంతో చదివి.. యూపిఎస్సి ర్యాంక్ సాధించిన రైతు కూతురు