ఈఐఎల్‌లో 96 ఎగ్జిక్యూటివ్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published : Apr 13, 2019, 02:45 PM IST
ఈఐఎల్‌లో 96 ఎగ్జిక్యూటివ్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సారాంశం

నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైస్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డింగ్/ఎన్డీటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, వేర్‌హౌస్, సేఫ్టీ ట్రేడ్స్/డిసిప్లేన్‌లో ఎగ్జిక్యూటివ్స్ Gr-IV, Gr-V and Gr-VI పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైస్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డింగ్/ఎన్డీటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, వేర్‌హౌస్, సేఫ్టీ ట్రేడ్స్/డిసిప్లేన్‌లో ఎగ్జిక్యూటివ్స్ Gr-IV, Gr-V and Gr-VI పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా న్యూఢిల్లీ, గురుగ్రామ్ ఈఐఎల్ వర్క్ స్టేషన్లలో పోస్టింగ్ ఇవ్వనుంది. 

ఏప్రిల్ 10, 2019 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 30, 2019 11.59గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. 

పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్స్(Gr-IV, Gr-V and Gr-VI)
సంస్థ: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్)
విద్యార్హత: సంబంధిత ఇంజినీరింగ్ ట్రేడ్/డిసిప్లేన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ
అనుభవం: నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన విధంగా.
జాబ్ లొకేషన్: న్యూఢిల్లీ, గురుగ్రాం.
జీతం: నెలకు హోదాను బట్టి రూ.1,15,200-1,60,000 
ఇండస్ట్రీ: ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ 
దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఏప్రిల్ 10, 2019
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2019

ఏప్రిల్ 30,2019 నాటికి వయో పరిమితి:

- ఎగ్జిక్యూటివ్ Gr.-IV అభ్యర్థుల వయస్సు 48ఏళ్లకు మించకూడదు
- ఎగ్జిక్యూటివ్ Gr.-V అభ్యర్థులు 50ఏళ్లకు మించి ఉండకూడదు
- ఎగ్జిక్యూటివ్ Gr.-VI అభ్యర్థులు 52ఏళ్లకు మించి ఉండకూడదు

పోస్టుల వివరాలు:  
ఎగ్జిక్యూటివ్ Gr-IV     57  
ఎగ్జిక్యూటివ్ Gr-V     33  
ఎగ్జిక్యూటివ్ Gr-VI     06  

ఎంపిక ప్రక్రియ: 
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ(ఢిల్లీలో), డాక్యుమెంట్ వేరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది. 

అభ్యర్థులు ఈఐఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు, మరిన్ని వివరాల కోసం http://recruitment.eil.co.in/ సంప్రదించవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
Success Story : సర్కార్ సాయంతో చదివి.. యూపిఎస్సి ర్యాంక్ సాధించిన రైతు కూతురు