అంగన్‌వాడీల్లో 5,905 ఉద్యోగాలు.. 10వ తరగతి అర్హత ఉంటే చాలు..

By Sandra Ashok KumarFirst Published Oct 6, 2020, 10:59 AM IST
Highlights

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,905 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కనీస విద్యా అర్హత ఉన్న మహిళలు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

మహిళా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,905 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కనీస విద్యా అర్హత ఉన్న మహిళలు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

మొత్తం ఉన్న అంగన్‌వాడీ పోస్టులలో 4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 1,468 మెయిన్‌ అంగన్‌వాడీ వర్కర్ల పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీలు చేపడుతున్నాయి.

Latest Videos

ఇప్పటికే పలు జిల్లాల్లో కొన్ని పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అత్యధిక ప్రాధ్యానత ఇస్తుండటంతో ఈ పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టి అర్హులైన వారిని ఎంపిక చేస్తామని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. ఏపీలోని మహిళా నిరుద్యోగులకు మాత్రమే ఈ అవకాశం. 

పోస్టుల వివరాలు
 అంగన్‌వాడీ హెల్పర్లు: 4,007 
మినీ అంగన్‌వాడీ వర్కర్లు: 430 
మెయిన్‌ అంగన్‌వాడీ వర్కర్ల : 1,468 

also read ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్స్‌లో టీచర్‌‌ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..! ...

అర్హత, వేతన వివరాలు
అభ్యర్థుల కనీస విద్యార్హత: 10వ తరగతి (మహిళలు మాత్రమే)
అంగన్‌వాడీల్లో వర్కర్ల వేతనం(మెయిన్) – రూ.11,500
అంగన్‌వాడీల్లో వర్కర్లు వేతనం (మినీ) – రూ.7 వేలు
హెల్పర్ల వేతనం – రూ.7 వేలు

click me!