ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వేర్వేరు డివిజన్లలో ఉన్న యూనిట్లలో 756 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇందులో విశాఖపట్నంలోని వాల్తేర్ డివిజన్‌లో 263 పోస్టులు ఉన్నాయి.
ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వేర్వేరు డివిజన్లలో ఉన్న యూనిట్లలో 756 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇందులో విశాఖపట్నంలోని వాల్తేర్ డివిజన్‌లో 263 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 7 దరఖాస్తులకు చివరి తేదీ.
ఒక అభ్యర్థి ఏదైనా ఒక యూనిట్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. వేర్వేరు డివిజన్లకు వేర్వేరు దరఖాస్తు ఫామ్స్ సబ్మిట్ చేస్తే పరిగణలోకి తీసుకోరు. అప్లయ్ చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి. అలాగే పూర్తి వివరాలకు https://rrcbbs.org.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
undefined
మొత్తం ఖాళీలు: 756
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, మంచేశ్వర్, భువనేశ్వర్- 190
ఖుర్దా రోడ్ డివిజన్- 237
వాల్తేర్ డివిజన్- 263
సంబాల్‌పూర్ డివిజన్- 66
వాల్తేర్ డివిజన్‌లో ఖాళీలు- 263
ఫిట్టర్- 102
వెల్డర్- 54
టర్నర్- 11
ఎలక్ట్రీషియన్- 50
మెషినిస్ట్- 4
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 4
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 1
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 1
వైర్‌మ్యాన్- 10
కార్పెంటర్- 9
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 4
ప్లంబర్- 7
మేసన్- 6
ముఖ్య సమాచారం
విద్యార్హతలు: 10వ తరగతి 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 8, 2022
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2022
వెబ్ సైట్ లింక్: