బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఒప్పంద ప్రాతిపదికన 220 పోస్టుల భర్తీకి అర్హలైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్ధులను అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఒప్పంద ప్రాతిపదికన 220 పోస్టుల భర్తీకి అర్హలైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్ధులను అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 14 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 220
జోనల్ సేల్స్ మేనేజర్లు (ఎంఎన్ఎంఈ వర్టికల్)- 11 పోస్టులు, రీజనల్ సేల్స్ మేనేజర్లు (ట్రాక్టర్ లోన్ వర్టికల్)- 9 పోస్టులు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఎంఎన్ఎంఈ సేల్స్)- 50, పోస్టులు సీనియర్ మేనేజర్లు (ఎంఎన్ఎంఈ సేల్స్)- 100, పోస్టులు మేనేజర్ (ఎంఎన్ఎంఈ సేల్స్)- 40 పోస్టులు.
- అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ బ్యాంకింగ్/సేల్స్/ఫోరెక్స్/మార్కెటింగ్/క్రెడిట్ అర్హతలున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.
- వయోపరిమితి: పోస్టును బట్టి 22 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
- ఎంపిక విధానం: అభ్యర్ధులను అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, మహిళా అభ్యర్ధులకు రూ.100.
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2022.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/