Metro Rail Jobs: మెట్రో రైల్‌లో ఉద్యోగ అవకాశాలు...మొత్తం ఖాళీలు ఇవే

By Sandra Ashok KumarFirst Published Dec 16, 2019, 12:14 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్-DMRC భారీగా ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేస్తోంది. మొత్తం 1493 ఖాళీలుకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ http://www.delhimetrorail.com/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్-DMRC భారీగా ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేస్తోంది. మొత్తం 1493 ఖాళీలుకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎగ్జిక్యూటీవ్ కేటగిరీలో 166, నాన్ ఎగ్జిక్యూటీవ్ కేటగిరీలో 1327 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఇంజనీర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులకు ఆసక్తి గల అభర్డులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు.

పోస్టుల విద్యార్హతల కోసం అభ్యర్డులు నోటిఫికేషన్ లో  చూసుకోవాలి. నోటిఫికేషన్  ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్డులు వేర్వేరుగా పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటుంది.  అభ్యర్థులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ http://www.delhimetrorail.com/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ 13 జనవరి 2020 .

Latest Videos

also read బీఈసీఐఎల్‌లో పారామెడికల్ ఉద్యోగాలు....మొత్తం పోస్టుల ఖలీలు 98

ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల ఖాళీల వివరాలు.

 
 మొత్తం ఖాళీలు- 1493

ఎగ్జిక్యూటీవ్ కేటగిరీ- 166
అసిస్టెంట్ మేనేజర్- 160
అసిస్టెంట్ మేనేజర్ / ఫైనాన్స్- 03
అసిస్టెంట్ మేనేజర్ / లీగల్- 03నాన్ ఎగ్జిక్యూటీవ్- 1327
జూనియర్ ఇంజనీర్- 548
ఫైర్ ఇన్‌స్పెక్టర్- 7
ఆర్కిటెక్ట్ అసిస్టెంట్- 14
అసిస్టెంట్ ప్రోగ్రామర్- 24
లీగల్ అసిస్టెంట్- 5
కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్- 386
అకౌంట్స్ అసిస్టెంట్- 48
స్టోర్ అసిస్టెంట్- 8
అసిస్టెంట్ / సీసీ- 7
ఆఫీసర్ అసిస్టెంట్- 8
స్టెనోగ్రాఫర్- 9

మెయింటనర్ / ఎలక్ట్రీషియన్- 101
మెయింటనర్ / ఎలక్ట్రానిక్ మెకానిక్- 144
మెయింటనర్ / ఫిట్టర్- 18

also read  Police Jobs notification: పోలీస్ రిక్రూట్మెంట్ 2019...మొత్తం1847 ఖాళీలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 డిసెంబర్  2019 
దరఖాస్తుకు చివరి తేదీ : 13  జనవరి  2020
ఫీజ్ చెల్లించుటకు చివరి తేదీ- 2020 జనవరి 13

అర్హత వయస్సు : 1 డిసెంబర్  2019  నాటికి 28 నుంచి 30 ఏళ్లు వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు రూ.250.

 పరీక్ష తేదీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.
 

click me!