బీఈసీఐఎల్‌లో పారామెడికల్ ఉద్యోగాలు....మొత్తం పోస్టుల ఖలీలు 98

By Sandra Ashok KumarFirst Published Dec 14, 2019, 1:17 PM IST
Highlights

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌)లో పారామెడికల్ ఉద్యోగాలు.సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు బీఈసీఐఎల్‌ అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ లో వివిధ విభాగాలలో ఉన్న మొత్తం ఖాళీలు 98. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు బీఈసీఐఎల్‌ అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.


నోటిఫికేషన్  వివరాలు.

Latest Videos

మొత్తం పోస్టుల ఖలీలా సంఖ్యా : 98

also read  Police Jobs notification: పోలీస్ రిక్రూట్మెంట్ 2019...మొత్తం1847 ఖాళీలు

పబ్లిక్ హెల్త్ నర్స్ (PHN): 15
అర్హత: బీఎస్సీ (నర్సింగ్) లేదా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 'ఎ'-గ్రేడ్ నర్స్ (హెల్త్ విజిటర్స్/ పబ్లిక్ హెల్త్ ట్రైనింగ్‌) అయి ఉండాలి. హిందీ తెలిసి ఉండాలి.
జీతం: రూ.38,000.

క్యాటరింగ్ సూపర్‌వైజర్: 01
అర్హత: పదోతరగతితో పాటు క్యాటరింగ్ విభాగంలో ఐటీఐ ఉండాలి. హిందీ తెలిసి ఉండాలి.
జీతం: రూ.20,000.


ఆగ్జిలరీ నర్సింగ్ మిడ్‌వైఫ్ (ANM): 60
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నర్సింగ్ కౌన్సెలింగ్‌ ఆఫ్ ఇండియాలో ఏఎన్‌ఎంగా సభ్యత్వం ఉండాలి. తగిన అనుభవంతోపాటు హిందీ తెలిసి ఉండాలి.
జీతం: రూ.24,000.

 డ్రెస్సర్: 12
అర్హత: మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేన్ ఇన్ డ్రెస్సింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ లేదా తత్సమాన సర్టిఫికేట్ ఉండాలి.
జీతం: రూ.18,000.

డైటీషియన్: 01
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(హోంసైన్స్/ హోం ఎకనామిక్స్). ఫుడ్ అండ్ న్యూట్రీషిన్‌లో స్పెషలైజేషన్ ఉండాలి. లేదా బీఎస్సీ(హోంసైన్స్/ హోం ఎకనామిక్స్)తోపాటు డైటేటిక్స్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
జీతం: రూ.35,000.


కుక్: 01
అర్హత: మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. అన్నిరకాల శాఖాహార, మాంసాహార వంటలు వండటం తెలిసి ఉండాలి. ట్రేడ్ టెస్ట్ అర్హత సాధించాలి.
జీతం: రూ.18,000.

మార్చురీ అటెండెంట్: 07
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. హిందీ తెలిసి ఉండాలి.
జీతం: రూ.18,000.

రిసెప్షనిస్ట్: 01
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఏడాది అనుభవతో పాటు హిందీ తెలిసి ఉండాలి.
జీతం: రూ.20,000.

also read  మెట్రోలో 1492 ఉద్యోగాలు....రేపే ఉద్యోగ ప్రకటన

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు డిడితోపాటు విద్యార్హత సర్టిఫికేట్లు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, పాన్ ‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జతచేసి నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్ క్యాటగిరికి రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. ''BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED'' పేరిట డిడి తీసి, దరఖాస్తుకు జతచేసి పంపాలి.


దరఖాస్తు పంపవలసిన చిరునామా:
Deputy General Manager (HR)
BECIL’s Corporate Office at BECIL

Bhawan, C-56/A-17, Sector-62,
Noida - 201307 (U.P).

click me!