Railway Jobs:సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల...స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు...

Published : Dec 17, 2019, 09:53 AM ISTUpdated : Dec 17, 2019, 10:24 AM IST
Railway Jobs:సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల...స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు...

సారాంశం

ముంబ‌యి నగరం కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు 17 డిసెంబరు(నేటి నుంచి)  నుంచి 31 డిసెంబరు వరకు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. 

ముంబ‌యి నగరం కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హతలతోపాటు సంబంధిత క్రీడా విభాగంలో సర్టిఫికేట్ పొందినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు 17 డిసెంబరు(నేటి నుంచి)  నుంచి 31 డిసెంబరు వరకు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉన్న మొత్తం ఖాళీలు 21.

also read Metro Rail Jobs: మెట్రో రైల్‌లో ఉద్యోగ అవకాశాలు...మొత్తం ఖాళీలు ఇవే

స్పోర్ట్స్ కోటా కింద క్రీడాల వారీగా కేటాయించిన ఖాళీలు: బాస్కెల్ బాల్-03, బాక్సింగ్-02, క్రికెట్-04, హాకీ-03, ఆక్వాటిక్స్ (వాటర్ పోలో)-01, కబడ్డీ-02, వాలీబాల్-01, వెయిట్ లిఫ్టింగ్-02, రెజ్లింగ్-03

ఉండాల్సిన  అర్హత‌లు:  పోస్టుల వారీగా తగిన విద్యార్హతలను నిర్ణయించారు. డిగ్రీ, ఇంట‌ర్, పదోతరగతితోపాటు ఐటీఐలో అర్హత పొంది ఉండాలి. సంబంధిత క్రీడ‌లో జాతీయ‌/ అంత‌ర్జాతీయ స్థాయిలో పాల్గొని ఉండాలి.

వయసు: 01.01.2020 నాటికి 18-25 సంవత్సరాల మ‌ధ్య వయస్సు వారై ఉండాలి.


దరఖాస్తు ఫీజు:  జనరల్, బీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, మహిళలు, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

also read 'DRDO'లో మల్టీటాస్కింగ్ పోస్టులు...పదోతరగతి అర్హత ఉంటే చాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కుల టెస్ట్ ద్వారా ఎంపికలు చేస్తారు. అలాగే సంబంధిత క్రీడా విభాగంలో ప్రతిభ, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు 40 మార్కులను, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్‌కు 50 మార్కులను, విద్యార్హత‌కు 10 మార్కులను కేటాయించారు.


ఆన్‌లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవడానికి చివ‌రితేది: 31.12.2019.

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
High Demand Jobs : లక్షల ఉద్యోగాలున్నా చేసేవారే లేరు.. జాబ్స్ లిస్ట్ ఇదే, ట్రై చేశారో లైఫ్ సెట్