Central Railway Jobs 2022: రైల్వేలో 2422 ఉద్యోగాలు.. ప‌ది పాసైతే చాలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 04:30 PM IST
Central Railway Jobs 2022: రైల్వేలో 2422 ఉద్యోగాలు.. ప‌ది పాసైతే చాలు..!

సారాంశం

సెంట్రల్‌ రైల్వే ట్రేడ్‌ అప్రెంటీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,422 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 17 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 

సెంట్రల్‌ రైల్వే ట్రేడ్‌ అప్రెంటీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,422 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 17 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆర్‌ఆర్‌సీ సెంట్రల్‌ రైల్వే వెబ్‌సైట్‌ https://rrccr.com/ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 16 దరఖాస్తులకు చివరితేది.

ముంబై క్లస్టర్‌లో ఖాళీల వివరాలు
- క్యారేజ్‌& వ్యాగన్(కోచింగ్) వాడి బండర్- 258
- కల్యాణ్ డీజిల్‌ షెడ్‌– 50
- కుర్లా డీజిల్‌ షెడ్‌– 60
- సీనియర్‌ డీ(TRS)కల్యాణ్‌– 179
- సీనియర్ డీ (TRS) కుర్లా– 192
- పెరల్‌ వర్క్‌షాప్ – 313
- మాతుంగ వర్క్‌షాప్‌ – 547
- ఎస్‌ అండ్‌ టీ వర్క్‌షాప్, బైకుల్లా– 60

భుసవల్‌ క్లస్టర్‌లో ఖాళీల వివరాలు
- క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ డిపో– 122 ఉద్యోగాలు
- ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌– 80 ఉద్యోగాలు
- ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ వర్క్‌షాప్‌– 118 ఉద్యోగాలు
- మన్మాడ్‌ వర్క్‌షాప్‌– 51 ఉద్యోగాలు
- డీఎండబ్ల్యూ నాసిక్‌ రోడ్‌– 47 ఉద్యోగాలు

పుణే క్లస్టర్‌లో ఖాళీల వివరాలు
- క్యారేజ్‌ & వ్యాగన్‌ డిపో – 31 ఉద్యోగాలు
- డీజిల్‌ లోకో షెడ్‌– 121 ఉద్యోగాలు

నాగ్‌పూర్‌ క్లస్టర్‌లో ఖాళీల వివరాలు
- ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌, అంజీ– 48 ఉద్యోగాలు
- క్యారేజ్‌ & వ్యాగన్‌ డిపో – 66 ఉద్యోగాలు

సోలాపూర్‌ క్లస్టర్‌లో ఖాళీల వివరాలు
- క్యారేజ్‌& వ్యాగన్ డిపో – 58 ఉద్యోగాలు
- కుర్దువాడి వర్క్‌షాప్‌– 21 ఉద్యోగాలు

విద్యార్హతలు:
అభ్యర్థులు యాభై శాతం మార్కులతో పదోతరగతి పాసై ఉండాలి. ఎన్‌సీవీ గానీ, ఎస్‌సీవీటి ఇచ్చే జాతీయ స్థాయిలో చెల్లుబాటు అయ్యేలా సంబంధిత విభాగాంలో ట్రెడ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లయ్‌ ఆన్‌లైన్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసేటప్పుడు కచ్చితంగా పదోతరగతి మార్క్‌షీట్‌, పుట్టిన తేదీ ధ్రువీకరించే సర్టిఫికేట్‌, ఐటీఐ సర్టిఫికేట్‌, ట్రేడ్‌ సర్టిఫికేట్‌, కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్‌ సర్టిఫికేట్‌, ఎక్స్‌ సర్వీస్‌ పీపుల్‌ అయితే డిశ్ఛార్జ్‌ సర్టిఫికేట్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోగ్రాఫ్స్‌, సంతకం చేసి స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేయాలి.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్‌ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. మిగతా వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు. ఈ ఫీజును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయసు 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్‌పై ఆధార పడి ఉంటుంది. మెరిట్‌ మార్కులు సాధించిన అభ్యర్థులను సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rrccr.com/

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Money Saving Tips : కేవలం రూ.20 వేల శాలరీతో రూ.2.5 కోట్లు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?