APPSC Recruitment: 730 ఉద్యోగాలు.. దరఖాస్తుకు గడువు పెంపు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 19, 2022, 01:10 PM IST
APPSC Recruitment: 730 ఉద్యోగాలు.. దరఖాస్తుకు గడువు పెంపు..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్‌తో సహా పలు పోస్టుల కోసం దరఖాస్తు గడువు తేదీని ఏపీపీఎస్సీ పొడిగించింది. అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్‌తో సహా పలు పోస్టుల కోసం దరఖాస్తు గడువు తేదీని ఏపీపీఎస్సీ పొడిగించింది. అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు జనవరి 28 తుది గడువుగా ఇచ్చారు. మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నేటి (జనవరి 19)తో ఈ గడువు ముగియనుండాలి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రెవెన్యూ శాఖలోని  670 జూనియర్ అసిస్టెంట్-కమ్-కంప్యూటర్ అసిస్టెంట్,  దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఈ పోస్టుల  గతేడాది డిసెంబర్ 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

 *అర్హతలు
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. 
 
*ఎంపిక ప్రక్రియ
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్,  మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హులు అవుతారు.
 
*దరఖాస్తు విధానం..
-అభ్యర్థులు ముందు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/(S(adg2igsdswpfppc1zybz3w1t))/Default.aspx ఓపెన్ చేయాలి.
-వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఉన్న  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
-ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2022లో 700+ ఎగ్జిక్యూటివ్ & కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం, ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌కి వెళ్లాలి.
-ఇప్పుడు అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
-ఆ తర్వాత అడిగిన వివరాలను ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను  పూర్తి చేయాలి.
-రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని  భద్రపర్చుకోవాలి.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్