CCRAS'లో క్లర్క్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

By Sandra Ashok KumarFirst Published Nov 22, 2019, 11:13 AM IST
Highlights

భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ‌ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌ అర్హత గల అభ్యర్థుల నుంచి క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..
 

న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌ (CCRAS) క్లర్క్ (యూడీసీ, ఎల్‌డీసీ) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యూడీసీ పోస్టులకు డిగ్రీ, ఎల్‌డీసీ పోస్టులకు ఇంటర్ అర్హత ఉండాలి. యూడీసీ పోస్టులకు రాతపరీక్ష, ఎల్‌డీసీ పోస్టులకు రాతపరీక్షతో పాటు టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.


వివ‌రాలు.

మొత్తం ఖాళీలు: 66

అప్పర్ డివిజ‌న్ క్లర్క్‌(యూడీసీ): 14

also read  Anganwadi Jobs: అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.

లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్‌(ఎల్‌డీసీ): 52

అర్హత‌: ఇంట‌ర్మీడియ‌ట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టైపింగ్ స్కిల్స్‌ అవసరం. కంప్యూటర్‌పై నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్‌ చేయగలగాలి.

వ‌యోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 18-27 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

దర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా.

also read  Navy Jobs:ఇండియన్ నేవీ 2020 నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.11.2019.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 19.12.2019.

 పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.

click me!