యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2020 టైమ్‌టేబుల్‌ను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో విడుదల చేసింది. యుపిఎస్‌సి మెయిన్ పరీక్ష 8 జనవరి 2021 నుండి ప్రారంభమై 17న ముగుస్తుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2020 టైమ్‌టేబుల్‌ను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో విడుదల చేసింది. యుపిఎస్‌సి మెయిన్ పరీక్ష 8 జనవరి 2021 నుండి ప్రారంభమై 17న ముగుస్తుంది.
పరీక్ష ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఐదు రోజుల్లో ఎస్సే పేపర్ ఉన్న రోజు మినహా ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణ జరుగుతుందంది.
undefined
పరీక్షలు మొదటి రోజు ఒక షిఫ్టులో, మిగిలిన రోజులలో రెండు షిఫ్టులలో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండవ షిఫ్ట్ 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
also read
పేపర్ 1 ఎస్సే జనవరి 8న మొదటి షిఫ్టులో, పేపర్ 2- జనరల్ స్టడీస్ I, II, III ఇంకా IV జనవరి 9 మరియు 10 తేదీలలో రెండు షిఫ్టులలో జరుగుతాయి. ఇండిన లాంగ్వేజ్, ఇంగ్లిష్ సంబంధించిన పేపర్ 1 రెండు షిఫ్టులలో జనవరి 16న జరుగుతుంది. ఆప్షనల్ పేపర్ 1 అండ్ 2 రెండు షిఫ్టులలో జనవరి 17న జరుగుతాయి.
అహ్మదాబాద్, ఐజ్వాల్, ప్రయాగ్‌రాజ్(అలహాబాద్), బెంగళూరు, భోపాల్, చండీగర్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, డిస్పూర్ (గౌహతి), హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్‌కతా, లక్నో , రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం, విజయవాడలో సివిల్స్ మెయిన్స్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సివిల్ సర్వీసెస్ మేయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హత గల అభ్యర్థుల కోసం యుపిఎస్‌సి పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారమ్ (డిఎఎఫ్) ను విడుదల చేసింది. డిఎఎఫ్(సిఎస్‌ఎం) కమిషన్ వెబ్‌సైట్‌లో నవంబర్ 11 సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు ఫారమ్(డీఏఎఫ్) నింపి సమర్పించాలీ.