ఇంటర్‌బోర్డు ఆధ్వర్యంలో నేటి నుంచి విద్యార్ధులకు ఉచిత పోలీస్‌ ట్రైనింగ్‌..

Ashok Kumar   | Asianet News
Published : Nov 04, 2020, 04:12 PM IST
ఇంటర్‌బోర్డు ఆధ్వర్యంలో నేటి నుంచి విద్యార్ధులకు ఉచిత పోలీస్‌ ట్రైనింగ్‌..

సారాంశం

ఇంటర్‌బోర్డు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్కారు కాలేజీల్లో ఉచిత పోలీసు శిక్షణ హైదరాబాద్‌ జిల్లాలో బుధవారం అంటే నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 

హైదరాబాద్ : పోలీసు ఉద్యోగం చేయాలనే విద్యార్ధులకు ప్రభుత్వం అద్భుతవకాశం అందిస్తుంది. ఇంటర్ చదువుతూ పోలీసు ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు  ఈ అవకాశాన్ని సాధ్వీనియోగం చేసుకోవచ్చు.

ఇంటర్‌బోర్డు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్కారు కాలేజీల్లో ఉచిత పోలీసు శిక్షణ హైదరాబాద్‌ జిల్లాలో బుధవారం అంటే నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

also read ఐటీఐ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

మొత్తం 7 కేంద్రాల్లో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేయగా, బోర్డు అధికారుల అనుమతి తీసుకొని ప్రస్తుతానికి నాలుగు కేంద్రాల్లో ఉచిత శిక్షణను ప్రారంభించనున్నారు. పోలీసు శిక్షణ ఏర్పాట్లపై ఇంటర్‌బోర్డు అధికారులు మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, డీఐఈవో బి. జయప్రదాబాయిలు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఫిజికల్‌ డైరెక్టర్లతో సమీక్షించారు. సర్కారు కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు, గతంలో ఇంటర్‌ పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బాలికల కోసం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (బాలికలు) మారేడుపల్లి, సికింద్రాబాద్‌,  ఎంఏఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (బాలికలు) నాంపల్లి, బాలుర కోసం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కాచిగూడ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (బాలుర) ఫలక్‌నుమా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
UPSC Interview Questions : నిత్యం మండుతూనే ఉంటుంది, కానీ బూడిద ఉండదు.. ఏమిటది?