టీఎస్ ఐసెట్-2020 షెడ్యూల్‌ను కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.
హైదరాబాద్ : టీఎస్ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదలైంది. దీనిని కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల మార్చ్ 9 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.
దరఖాస్తులు సమర్పించటానికి మార్చి 30 చివరి తేదీగా నిర్ణయించారు. కాగా లెట్ ఫీజు రూ. 500 ఫైన్‌తో మే 14 వరకు, రూ. 5 వేల ఫైన్ చెల్లించి మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
undefined
also read TS EAMCET : ఎంసెట్ నోటిఫికేషన్ 2020 విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ
మే 20, 21 తేదీల్లో ఐసెట్-2020 పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు. మే 14 నుంచి ఐసెట్- పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచన్నరు. మే 27న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఈ సారి ఐసెట్ పరీక్ష రాసే అభ్యర్డులు నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కన్వీనర్ తెలిపారు.