జూన్ 20 నుంచి డిగ్రీ, బీటెక్‌ పరీక్షలు...

By Sandra Ashok KumarFirst Published Jun 5, 2020, 1:33 PM IST
Highlights

బ్యాక్‌లాగ్‌తో సహా అన్ని యుజి, పిజి ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు మాత్రమే పరీక్ష నిర్వహించాలని టిఎస్‌సిహెచ్‌ఇ పేర్కొంది. 20 జూన్ 2020 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి అని తెలిపింది.

న్యూ ఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సెమిస్టర్ / వార్షిక పరీక్షలు నిర్వహించడానికి మార్గదర్శకాలను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిఎస్సిహెచ్ఇ) విడుదల చేసింది.జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని కాలేజీల్లో ఈ నెల 20 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జంబ్లింగ్‌ విధానాన్ని వర్సిటీ రద్దు చేసింది. చదివిన కాలేజీల్లోనే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. అన్ని యునివర్సిటీ రిజిస్ట్రార్లు, కంట్రోలర్లతో ప్రాథమిక చర్చలు జరిపిన తరువాత ఈ మార్గదర్శకాలను రూపొందించారు.

బ్యాక్‌లాగ్‌తో సహా అన్ని యుజి, పిజి ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు మాత్రమే పరీక్ష నిర్వహించాలని టిఎస్‌సిహెచ్‌ఇ పేర్కొంది. 20 జూన్ 2020 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి అని తెలిపింది.బీటెక్‌ ప్రశ్నాపత్రంలో పార్టు-ఏ, పార్టు-బీ విధానాన్ని రద్దు చేసి మొత్తం ఒకే విభాగంలో ప్రశ్నలు రూపొందించామని తెలిపారు ప్రతి ప్రశ్నాపత్రంలో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఐదింటికి జవాబు రాయాలి. 

పరీక్షా సమయం 3 గంటల నుండి 2 గంటలకు తగ్గించాలని టిఎస్‌సిహెచ్‌ఇ తెలిపింది. ఇందుకు  ప్రశ్నపత్రాన్ని తదనుగుణంగా సవరించాలి అలాగే మొత్తం సిలబస్‌ను కవర్ చేయాలి అని పేర్కొంది.

also read ఏపీ డీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల... దరఖాస్తు చేయండిలా...

పరీక్ష సమయం తగ్గించినందున  ప్రశ్నపత్రంలో ఎక్కువ ఆప్షన్స్ చేర్చాలని టిఎస్‌సిహెచ్‌ఇ పేర్కొంది. ప్రశ్నపత్రం చేసిన మార్పులను యునివర్సిటీలు నిర్ణయించగలవు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఐసీఎంఆర్‌ సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని, విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్‌ చేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. 

 యుజి పరీక్షల విషయంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించవచ్చు, అంటే ఒక సెషన్‌లో బి.కామ్, బిఎ మరొక సెషన్లో బిఎస్సి.ఇంటర్నల్ , ఎక్స్ టర్నల్ పరీక్షల  నిర్వహనపై  సంబంధిత ప్రిన్సిపాల్స్‌కు అధికారం ఉంటుంది. 

పిహెచ్.డి. యుజిసి మార్గదర్శకాల ప్రకారం సెమినార్లు / వివా-వోస్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అనుమతించవచ్చు. పీహెచ్‌డీ సంబంధించి ఆన్‌లైన్ సెమినార్లు / వైవ-వోస్, వెబ్ / యాప్ లింక్‌ను డిఆర్‌సి సభ్యులు, ఫ్యాకల్టీ సభ్యులు, సంబంధిత విభాగాల సభ్యులు ముందుగానే పంచుకోవాలి.

click me!