ఆంధ్ర ప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీసెట్-2020) నోటిఫికేషన్ విడుదలైంది.
అమరావతి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీసెట్-2020) నోటిఫికేషన్ విడుదలైంది. 2020-22 విద్యా సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్స్), ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ లో ఆఫర్ చేసిన రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) కోర్సు లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసు కోవాలని డీసెట్-2020 కన్వీనర్ కోరారు. https://apdeecet.apcfss.in వెబ్ సైట్ ద్వారా జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
undefined
ఐఐటీ -జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది జూలై 18-23 మధ్య నిర్వహించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఆగష్టు మాసంలో జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఐఐటీ -జేఈఈ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలపై కూడ కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది జూలై 26వ తేదీన నీట్ పరీక్షలను నిర్వహించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.
ఐఐటీ -జేఈఈ మెయిన్స్ పరీక్షలను జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఆగష్టు మాసంలో నిర్వహించనున్నట్టుగా కేంద్రం తెలిపింది. కానీ ఏ రోజున ఈ పరీక్షలు నిర్వహిస్తామనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఈ తేదీని తర్వాత ప్రకటించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.
లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు పలుు ప్రవేశ పరీక్షలను రద్దు చేశాయి. ఐఐటీ -జేఈఈ , నీట్ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో ఇతర రాష్ట్రాలు కూడ పరీక్షల షెడ్యూల్ కూడ ప్రకటిస్తోంది.