ఇంజనీరింగ్‌ పరీక్షలపై జేఎన్‌టీయూహెచ్‌ కీలక నిర్ణయం..!

By Sandra Ashok KumarFirst Published May 7, 2020, 3:12 PM IST
Highlights

పదో తరగతి సహ అన్నీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఇంజినీరింగ్‌ చదివే విద్యార్ధులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్‌టీయూహెచ్ తెలిపింది. ఇంజినీరింగ్‌ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జూన్‌ చివరి వారంలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనుంది.

జేఎన్‌టీయూహెచ్ విద్యార్ధుల పరీక్షల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలోని అన్నీ కాలేజీలు మూతపడ్డాయి. పదో తరగతి సహ అన్నీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఇంజినీరింగ్‌ చదివే విద్యార్ధులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్‌టీయూహెచ్ తెలిపింది.

ఇంజినీరింగ్‌ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జూన్‌ చివరి వారంలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనుంది. తరువాత జులై మధ్యలో ఫస్ట్ , సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. అయితే ఇప్పుడు సెమిస్టర్‌ ప్రశ్నపత్రంలో కొన్ని మార్పులు తీసుకురానున్నారు. కచ్చితంగా రాయాల్సిన సెక్షన్‌ ప్రశ్నలకు బదులుగా పూర్తిగా చాయిస్‌ ప్రాతిపదికన ప్రశ్నలివ్వాలని నిర్ణయించారు.

also read ఐఐటీ-జేఈఈ, నీట్‌ పరీక్షల తేదీలు ఖరారు...

పరీక్ష సమయం 3 గంటల నుంచి 2 గంటలకు కుదించడంతో పాటు చివరి సెమిస్టర్‌ విద్యార్థులు ప్రాజెక్టులను ఆన్‌లైన్‌ (వైవా) ద్వారా పూర్తి చేయనున్నారు. మిగిలిన సంవత్సరాల విద్యార్థులకు జులైలో కళాశాలలకు వచ్చాక ల్యాబ్‌ ఉంటాయి. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కాలానికి సంబంధించి విద్యార్థులకు పూర్తి హాజరును కలపాలని పాలకమండలి నిర్ణయించింది.

అంతకుముందు పనిదినాల్లో విద్యార్థులు ఎన్ని రోజులు కళాశాలకు వస్తే అంతే హాజరును పరిగణిస్తారు.క్రెడిట్స్‌ విషయంలో సడలింపులివ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం  ఫస్ట్ , సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు సబ్జెక్టులపరంగా ఎలాంటి డిటెన్షన్‌ లేకుండా మరుసటి ఏడాదికి ప్రమోట్‌ చేస్తారు.

బ్యాక్‌లాగ్స్‌ ఉంటే మరుసటి ఏడాదికల్లా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌ సెకండ్, థర్డ్ ఇయర్ తరగతులు ఆగస్టులో ప్రారంభమవుతాయి. ఫస్ట్ ఇయర్ క్లాసులు సెప్టెంబరులో మొదలవుతాయి.విద్యార్థులు చదివే కళాశాలలోనే పరీక్షలు రాసుకునేలా వెసులుబాటు కల్పించింది. మరింత పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌: https://jntuh.ac.in/  చూడండి.

click me!