పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల...మార్చి 31 నుంచి...

By Sandra Ashok Kumar  |  First Published Mar 7, 2020, 3:49 PM IST

. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలకు వాయిదా వేసి కొత్త షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని పరీక్ష తేదీలను విడుదల చేసింది ఏ‌పి ప్రభుత్వం. 


ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలకు వాయిదా వేసి కొత్త షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని పరీక్ష తేదీలను విడుదల చేసింది ఏ‌పి ప్రభుత్వం. దీని ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరుగుతాయి.

కొత్త విడుదల చేసిన పరీక్ష షెడ్యూల్ ఇలా ఉంది.

Latest Videos

undefined

మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1

ఏప్రిల్ 1 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2

ఏప్రిల్ 3న – సెకండ్ లాంగ్వేజ్ పేపర్

ఏప్రిల్ 4న – ఇంగ్లీష్ పేపర్ 1

ఏప్రిల్ 6న – ఇంగ్లీష్ పేపర్ 2

also read ఏప్రిల్‌ 29 నుంచి ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

ఏప్రిల్ 7న – మ్యాథమేటిక్స్ పేపర్ 1

ఏప్రిల్ 8న – మ్యాథమేటిక్స్ పేపర్ 2

ఏప్రిల్ 9న – జనరల్ సైన్స్ పేపర్ 1

ఏప్రిల్ 11న – జనరల్ సైన్స్ పేపర్ 2

ఏప్రిల్ 13న – సోషల్ స్టడీస్ పేపర్ 1

ఏప్రిల్ 15న – సోషల్ స్టడీస్ పేపర్ 2

విద్యార్ధులు పరీక్ష సెంటర్లను ఒకరోజు ముందుగానే చూసుకోవాలని అలాగే పరీక్ష సెంటర్లకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని తెలిపారు. 

click me!