ఏప్రిల్‌ 29 నుంచి ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

Ashok Kumar   | Asianet News
Published : Mar 07, 2020, 03:24 PM IST
ఏప్రిల్‌ 29 నుంచి ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

సారాంశం

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి ప్రారంభం కానున్నాయని  యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ : డా.బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి ప్రారంభం కానున్నాయని  యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి 4వ తేదీ వరకు ఉంటాయని రెండో సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి 11వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు మే 13 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

also read స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ...వెంటనే దరఖాస్తు చేసుకోండీ...

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. మార్చి 29వ తేదీ లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

పూర్తి వివరాలకు సంబంధించి యూనివర్సిటీ వెబ్‌పోర్టల్‌తో పాటు సంబంధిత అధ్యయన కేంద్రంలో సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

రూ.40 వేల స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. విద్యార్థులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!