పేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నత చదువులు చదవాలంటే ఇటీవల కాలంలో చాలా కష్టంగా మారింది. చదవాలనే కోరిక, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు చాలా మంది పేద, మధ్య తరగతికి చెందిన కుటుంబాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నాయి.
పేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నత చదువులు చదవాలంటే ఇటీవల కాలంలో చాలా కష్టంగా మారింది. చదవాలనే కోరిక, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు చాలా మంది పేద, మధ్య తరగతికి చెందిన కుటుంబాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నాయి.
ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు విద్యా రుణాల(ఎడ్యుకేషన్ లోన్స్)ను అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రతిష్టాత్మక కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. అయితే, మరి కొందరికి సరైన అవగాహన లేక ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోలేకపోతున్నారు.
undefined
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్ పేరిట రుణాలను అందిస్తోంది. మనదేశంలోనే గాక విదేశాల్లో చదువుకునేందుకు కూడా రుణాలు ఇస్తోంది.
ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు సబ్సిడీ పథకాలు కూడా బ్యాంకులు అందిస్తున్నాయి.
ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ గురించిన మరిన్ని వివరాలు:
భారతదేశంలో ఉన్న విద్య కోసం గరిష్టంగా రూ. 10లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు.
ఇక విదేశాల్లో చదువుకోవాలంటే రూ. 20లక్షల వరకు లోన్ పొందవచ్చు.
కోర్సు పూర్తి చేసుకున్న 15ఏళ్ల తర్వాత వరకు లోన్ తిరిగి చెల్లించవ్చు.
ఎడ్యుకేషన్ లోన్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎస్బీఐలో ఎడ్యుకేషన్ లోన్ కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్లు:
- ఏదైనా ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్
- 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు
- గ్రాడ్యుయేషన్ రిజల్ట్-సెమిస్టర్ వైజ్(అవసరమైతే)
- విదేశాల్లో చదవాలనుకుంటే పాస్‌పోర్ట్, టెన్త్, ఇంటర్ అకడెమిక్ రికార్డ్, గ్రాడ్యుయేషన్ రిజల్ట్, క్యాట్, సీమ్యాట్, జేఈఈ, నీట్, సెట్, జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్ లాంటి ఎంట్రెన్స్ పరీక్షల రిజల్ట్, విద్యాసంస్థ ఇచ్చే ఆఫర్ లెటర్ తప్పనిసరిగా సమర్పించాలి. దీంతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది.
- గతంలో ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వెల్లడించాలి.
- కో-అప్లికెంట్ ఉంటే.. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, గతంలో తీసుకున్న రుణాల వివరాలు ఇవ్వాలి.
- కో-అప్లికెంట్ ఆదాయ వివరాలు వెల్లడించాలి.
ఇక్కడ క్లిక్ చేసి ఎస్బీఐలో ఎడ్యుకేషన్ లోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి