పీజీ మెడికల్ సీట్లలో EWS కోటాకు అనుమతి

By rajesh yFirst Published Apr 12, 2019, 1:30 PM IST
Highlights

అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే ఈడబ్ల్యూఎస్ కోటా కింద పీజీ వైద్యవిద్య(మెడికల్)  సీట్లలో 10శాతం సీట్లను కేటాయిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే ఈడబ్ల్యూఎస్ కోటా కింద పీజీ వైద్యవిద్య(మెడికల్)  సీట్లలో 10శాతం సీట్లను కేటాయిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

కాగా, వచ్చే విద్యాసంవత్సరం(2020-21) నుంచి ఈ పెంపు వర్తిస్తుందని ఎంసీఐ తెలిపింది. అయితే పెంచిన సీట్లకు అనుగుణంగా మెడికల్ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్, శిక్షణ, పడకలు, తదితర సదుపాయాలను కల్పించుకోవాలని కోరుతూ అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులకు ఎంసీఐ లేఖ పంపింది.

తెలంగాణలో ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 706 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సీట్ల సంఖ్య 10శాతం పెరగడంతో అదనంగా 71 సీట్లు పెరగనున్నాయి. 

ఎంబీబీఎస్ సీట్లకు ఇదే విధానాన్ని వర్తింపజేస్తారని, దీంతో ప్రస్తుతమున్న 1150 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 115 సీట్లు పెరిగే అవకాశం ఉంది.

click me!