కే.వీ. స్కూల్స్ లో ఎంట్రెన్స్ కోసం ప్రారంభమైన ద‌ర‌ఖాస్తులు

By Sandra Ashok Kumar  |  First Published Jul 20, 2020, 4:38 PM IST

2020-21 విద్యాసంవ‌త్స‌రానికి ఒక‌టో త‌ర‌గతిలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌ చేశారు. నోటిఫికేష‌న్ ప్రకారం అడ్మిషన్ కోసం ఆగ‌స్టు 7వ తేదీవ‌ర‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్లు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 


న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్కూల్స్ విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదు. దేశంలో ఉన్న కేంద్రీయ విద్యాల‌యాల్లో(కే‌.వి స్కూల్స్) 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి ఒక‌టో త‌ర‌గతిలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌ చేశారు.

నోటిఫికేష‌న్ ప్రకారం   ఆగ‌స్టు 7వ తేదీవ‌ర‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్లు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఎంపికైన విద్యార్థుల పేర్ల‌ను ఆగ‌స్టు 11న ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది.

Latest Videos

undefined

also read ఎన్‌సీఎల్‌లో 512 ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా అర్హత ఉంటే చాలు.. ...

రెండో విడ‌త జాబితాను ఆగ‌స్టు 19న, సీట్లు మిగిలితే ఆగ‌స్టు 23న మూడో జాబితాను విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించింది. రెండో త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌రకు ఖాళీగా ఉన్న సీట్ల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తులు ప్రారంభమ‌య్యాయ‌ని, జూలై 25తో అప్లికేష‌న్ గ‌డువు ముగుస్తుంద‌ని తెలిపింది.

ఆగ‌స్టు 24 నుంచి 26 వ‌ర‌కు సీట్లు కేటాయిస్తామ‌ని వెల్ల‌డించింది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్  సందర్శించవచ్చు. 
 

click me!