సికింద్రాబాద్‌లో ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Ashok Kumar   | Asianet News
Published : Nov 14, 2020, 05:44 PM ISTUpdated : Nov 14, 2020, 11:17 PM IST
సికింద్రాబాద్‌లో ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ..  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

సారాంశం

వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని ఎఓసి సెంటర్‌లో ఈ నియామక ర్యాలీ జరుగుతుందని భారత సైన్యం తెలిపింది.

ఇండియన్ ఆర్మీ యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద నియామక ర్యాలీని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని ఎఓసి సెంటర్‌లో ఈ నియామక ర్యాలీ జరుగుతుందని భారత సైన్యం తెలిపింది.

సోల్జర్ టెక్ (ఎఇ), సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, ఔట్‌స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మెన్‌ (ఓపెన్ కేటగిరీ) పోస్టీల భర్తీకి ఈ నియామక ర్యాలీని నిర్వహించనున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (డిఫెన్స్ వింగ్) విడుదల చేసింది. అయితే వచ్చే ఏడాది జనవరిలో కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులు అనుకూలంగా ఉంటే రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.

ఔట్‌స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మెన్‌ (ఓపెన్ కేటగిరీ) కోసం స్పోర్ట్స్ ట్రయల్స్ జనవరి 15 ఉదయం 8 గంటలకు ఏ‌ఓ‌సి సెంటర్ సికింద్రాబాద్ లోని థాపర్ స్టేడియంలో జరుగుతాయి.

బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబ్బడి లాంటి క్రీడల్లో నైపుణ్యం ఉన్న వారికి 2021 జనవరి 15న స్పోర్ట్స్ ట్రయల్ ఉంటుంది.అభ్యర్థులకు నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో సీనియర్ లేదా జూనియర్ లెవెల్‌లో సర్టిఫికెట్లు పొంది ఉండాలి.

స్క్రీనింగ్ తేదీ నుంచి   రెండేళ్లలోపు తీసుకున్న సర్టిఫికెట్లు మాత్రమే ఉండాలి. అంతకన్నా పాత సర్టిఫికెట్లు ఉంటే పరిగణలోకి తీసుకోరు.

also read బీఈ/బీటెక్‌ చేసిన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.42 వేల జీతం..

భర్తీ చేసే పోస్టులు: సోల్జర్ టెక్ (ఏ‌ఈ), సోల్జర్ జనరల్ డ్యూటీ (జి‌డి), సోల్జర్ ట్రేడ్‌మెన్, ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్ మెన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టులు భర్తీచేస్తారు.

విద్యార్హతలు:
సోల్జర్ జనరల్ డ్యూటీ (జి‌డి) పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీ 45 శాతం మార్కులతో పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి.
సోల్జర్ ట్రేడ్‌మెన్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత కావాలి.
సోల్జర్ టెక్ (ఏ‌ఈ) పోస్టుకు సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 పాస్ కావాలి.
సోల్జర్ సి‌ఎల్‌కే /ఎస్‌కే‌టి  పోస్టుకు 10+2 లేదా ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కావాలి.
ర్యాలీ జరిగే తేదీ: 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు
స్పోర్ట్స్ ట్రయల్ నిర్వహించే తేదీ: 2021 జనవరి 15
వయస్సు: సోల్జర్ జనరల్ డ్యూటీ (జి‌డి) కేటగిరీకి 17.5 నుంచి 21 ఏళ్లు, ఇతర కేటగిరీలకు 17.5 నుంచి 23 ఏళ్లు.
వెబ్‌సైట్‌: http://www.joinindianarmy.nic.in/

PREV
click me!

Recommended Stories

Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
UPSC Interview Questions : నిత్యం మండుతూనే ఉంటుంది, కానీ బూడిద ఉండదు.. ఏమిటది?