ఐఐటీ-జేఈఈ, నీట్‌ పరీక్షల తేదీలు ఖరారు...

By Sandra Ashok Kumar  |  First Published May 5, 2020, 2:31 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ పరీక్షలకు సంబంధించి పుకార్లను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐఐటీ-జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 

న్యూఢిల్లీ: కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ ఐఐటీ, జేఈఈ, నీట్‌ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పూర్తి  వివరాలును వెల్లడించారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ పరీక్షలకు సంబంధించి పుకార్లను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐఐటీ-జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Latest Videos

undefined

also read ఆగిపోయిన టెన్త్ ప‌రీక్ష‌లు పూర్తిగా ర‌ద్దు...? గందరగోళంలో విద్యార్ధులు...

ఇక నీట్‌ పరీక్షను జూలై 6న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల తేదీలను మాత్రం కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఆగస్టులో జేఈఈ అడ్వాన్సుడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలోనే వాటి తేదీలను ప్రకటిస్తామని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ చెప్పారు.

తాజాగా వాయిదా పడ్డ సి‌బి‌ఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి వస్తున్న పుకార్లపై స్పందిస్తూ  పరీక్షలను రద్దు చేసే ప్రసక్తి లేదు రద్దయిన పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని సి‌బి‌ఎస్‌ఈ బోర్డ్  తెలిపింది. 

click me!