సిబిఎస్‌ఇ స్కాలర్‌షిప్ పొందేందుకు విద్యార్డులకు మంచి అవకాశం, దరఖాస్తు గడువు మరోసారి పెంపు..

By S Ashok KumarFirst Published Dec 26, 2020, 12:46 PM IST
Highlights

స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతే చింతించకండి. మీకు ఇంకా అవకాశం ఉంది, అవును నిజమే.. స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సిబిఎస్ఇ బోర్డు గడువును మళ్లీ పొడిగించింది. 

మీరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతే చింతించకండి. మీకు ఇంకా అవకాశం ఉంది, అవును నిజమే.. స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సిబిఎస్ఇ బోర్డు గడువును మళ్లీ పొడిగించింది.

మొదటి దరఖాస్తులు 21  డిసెంబర్ 2020లోగా సమర్పించాల్సి ఉంది. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తు ఇప్పుడు అభ్యర్థులు 2020 డిసెంబర్ 28 వరకు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.

సిబిఎస్‌ఇ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం ఆడపిల్లల కోసం అందిస్తున్నారు. అంటే, ఒకే కుమార్తె ఉన్న తల్లిదండ్రులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

also read 

ముఖ్యమైన తేదీలు

ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 డిసెంబర్ 2020.  దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ (పునరుద్ధరణ మాత్రమే) 08 జనవరి 2021. తుది గడువు ముగిసిన తరువాత సమర్పించిన దరఖాస్తులు అంగీకరించబడవు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
ఈ స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పునరుద్ధరణ కోసం హార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం లింక్  పై  క్లిక్ చేయండి.

అర్హతలు ఏమిటి?

ఈ స్కాలర్‌షిప్ మహిళా విద్యార్థులకు మాత్రమే. తల్లిదండ్రుల ఏకైక కుమార్తె అయిన విద్యార్థులు మాత్రమే అర్హులు. అంటే సోదరుడు లేదా సోదరి లేని వారు. 2020 అకాడెమిక్ సెషన్‌లో విద్యార్థులు సిబిఎస్‌ఇ గుర్తింపు పొందిన పాఠశాల నుండి 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులు కావడం అవసరం.

 ఇంతకు ముందు ఈ స్కాలర్‌షిప్ పొందిన వారు, దాని పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు 2019 అకాడెమిక్ సెషన్‌లో మొదటిసారి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఈ స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులు మాత్రమే. 

అర్హతలకు సంబంధించిన వివరణాత్మక సమాచారం కోసం, సిబిఎస్‌ఇ స్కాలర్‌షిప్ అధికారిక వెబ్‌సైట్ https://cbseit.in/cbse/2020/sgcx/default.aspx లింక్‌పై క్లిక్ చేయండి.

click me!