BHEL jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Published : Dec 06, 2019, 01:53 PM IST
BHEL jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సారాంశం

భార‌త్ హెవీ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌‌లో మెడికల్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సరైన అర్హతలు కలిగిన వారు బీహెచ్ఈఎల్‌ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి.  

హైదరాబాద్‌ నగరంలోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(BHEL) తాత్కాలిక (టెంపరరీ) మెడికల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు బి‌హెచ్‌ఈ‌ఎల్ అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ వివ‌రాలు.

మొత్తం ఖాళీలు సంఖ్యా: 06

also read AIR Jobs : అల్ ఇండియా రేడియోలో ఉద్యోగ అవకాశాలు...

సూప‌ర్ స్పెషలిస్ట్/స్పెషలిస్ట్: 02
విభాగాలు: గ్యాస్ట్రో ఎంటరాలజీ-01, యూరాలజీ-01.
అర్హత: డీఎం/డీఎన్‌బీ(గ్యాస్ట్రో ఎంటరాలజీ) (లేదా) ఎంసీహెచ్/డీఎం/డీఎన్‌బీ (యూరాలజీ).

స్పెషలిస్ట్: 01
విభాగం: జనరల్ సర్జరీ
అర్హత: ఎంఎస్/‌డీఎన్‌బీ
ఎంబీబీఎస్: 01
అర్హత: ఎంబీబీఎస్

వమోపరిమితి: అభ్యర్ధులు 01.12.2019 నాటికి గరిష్ఠ వయసు 65 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ: బి‌హెచ్‌ఈ‌ఎల్ కంపనీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు రాతపూర్వకంగా నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు పంపించాలి.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

also read SSC CGL 2019: 'కేంద్ర ఉద్యోగాలు'...ఇంటర్ అర్హత ఉంటే చాలు...

దరఖాస్తు చివ‌రితేది: 27.12.2019.


దరఖాస్తులు పంపవల్సిన చిరునామా:

DY. MANAGER/HR- RMX, HRM Dept.,
Ground Floor, Administrative Building,
BHEL, RC Puram,
Hyderabad, 502032.

PREV
click me!

Recommended Stories

Bank Jobs : యువతకు సూపర్ ఛాన్స్.. రూ.93,960 జీతంతో మెనేజర్ స్థాయి ఉద్యోగాలు
BHEL Recruitment : కేవలం ఐటిఐ చేసుంటే చాలు.. ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు