ఐబీపీఎస్ ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానుస్తున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానుస్తున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు జనవరి 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 8. మరింత పూర్తి సమాచారం కోసం https://www.ibps.in/ అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఉన్న ఖాళీలు: 06
1) అనలిస్ట్ ప్రోగ్రామర్ - విండోస్: 01
అర్హత: ఫుల్ టైం బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
undefined
2) అనలిస్ట్ ప్రోగ్రామర్ - ఫ్రంట్ఎండ్: 02
అర్హత: ఫుల్ టైం బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
3) ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజినీర్: 01
అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
4) ఐటీ ఇంజినీర్ (డేటా సెంటర్): 02
అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
అభ్యర్ధుల వయసు: 01.01.2021 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
పరీక్షా విధానం: ఆన్‌లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో వివిధ విభాగాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఆప్టిట్యూడ్ 50 మార్కులకు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 మార్కులకు ఉంటుంది. చివరగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ మెరిట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16 జనవరి 2021.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 08, 2021.
అధికారిక వెబ్‌సైట్:https://www.ibps.in/