బీటెక్‌, పి‌జి అర్హతతో పరీక్ష లేకుండా బ్యాంక్‌ ఉద్యోగాలు.. వెంటే క్లిక్ చేసి ధరఖాస్తు చేసుకోండీ..

By S Ashok Kumar  |  First Published Dec 24, 2020, 5:32 PM IST

ఐడిబిఐ బ్యాంక్ 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు  7 జనవరి 2021న లేదా అంతకు ముందులోగా idbibank.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ బ్యాంక్) 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు  7 జనవరి 2021న లేదా అంతకు ముందులోగా idbibank.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  డిసెంబర్‌ 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

ఈ 134 ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు, అందులో 62 మేనేజర్ (గ్రేడ్ బి)  ఖాళీలు, 52 ఎజిఎం (గ్రేడ్ సి), 11 డిజిఎం (గ్రేడ్ డి), 9 అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఎ)  ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకు https://www.idbibank.in/index.asp వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Latest Videos

undefined

ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్య‌ర్థుల త‌దుప‌రి ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతోంది. ఆన్‌లైన్‌లో పంపించిన ద‌ర‌ఖాస్తుల్లోని విద్యార్హ‌త‌లు, అనుభ‌వం, ఇత‌ర వివ‌రాల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని గ్రూప్ డిస్క‌ష‌న్(జీడీ)/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

also read 

ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా చివరి ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. దీన్ని 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. దీనిలో జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు 50, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడ‌బ్ల్యూడీల‌కు 45 క‌నీస అర్హ‌త మార్కులుగా కేటాయించారు. జీడీ/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్య‌ర్థుల‌కు బ్యాంక్ నిబంధ‌న‌ల ప్ర‌కారం మెడిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.

అర్హ‌త‌: పోస్టులను బట్టి క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టు్ల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు నైపుణ్యాలు, అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.700, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.150.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ: 24 డిసెంబర్‌  2020 నుండి 07 జనవరి  2021 వరకు.

అధికారిక వెబ్‌సైట్‌: https://www.idbibank.in/
 

click me!