నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలు..ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి..

By S Ashok KumarFirst Published Jan 7, 2021, 6:30 PM IST
Highlights

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 452 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం ఈ నియామక ప్రక్రియను నిర్వహిస్తోంది.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 452 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం ఈ నియామక ప్రక్రియను నిర్వహిస్తోంది.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్‌ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. 11 జనవరి 2021  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. ఆన్ లైన్ రాత పరీక్షలు ఫిబ్రవరి 1, 7 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/ చూడొచ్చు.

also read  

విద్యార్హతలు: పోస్టులను బట్టి వివిధ విద్యా అర్హతలను నిర్ణయించారు. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

ఎంపిక చేసే విధానం: మేనేజ‌ర్ (క్రెడిట్ ప్రొసీజ‌ర్స్‌), ఇంజినీర్ (ఫైర్) ఉద్యోగాలు మినహా మిగిలిన అన్ని పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్, సంబంధిత ప్రొఫెషనల్ నాలెడ్జ్ పరిశీలిస్తారు. మేనేజ‌ర్ (క్రెడిట్ ప్రొసీజ‌ర్స్‌), ఇంజినీర్ (ఫైర్) ఉద్యోగాలకు మాత్రం దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అందులో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం
మేనేజర్ (మార్కెటింగ్), డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో పాసైన వారికి మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు. 

click me!