నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఉద్యోగ మేళా.. వివరాల కోసం క్లిక్ చేయండి..

Ashok Kumar   | Asianet News
Published : Mar 27, 2021, 07:03 PM IST
నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఉద్యోగ మేళా.. వివరాల కోసం క్లిక్ చేయండి..

సారాంశం

ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి  రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ 800 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ 800 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఇందుకోసం మార్చి 31వ తేదీన విజయవాడలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీసిటీలోని రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా  సంస్థలో జింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 800 పోస్టుల భర్తీ కోసం ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి సహకారం తీసుకుంటోంది.

ప్రొడక్ట్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

అయితే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి. కేవలం అమ్మాయిలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.11,120 వేతనం ఇవ్వనున్నారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఉచిత భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తారు.

also read హెచ్‌సి‌ఎల్ లో భారీగా ఉద్యోగాలు.. టెన్త్‌‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసైన వాళ్లు అప్లయి చేసుకోండీ ...

రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ జరిగే వేదిక: అఖినవ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్,
 40-27-88/1, లోహియా టవర్స్, 
నిర్మలా కాన్వెంట్ ఎదురుగా,
 పటమట, విజయవాడ, సీఆర్‌డీఏ రీజియన్.

ఆసక్తి గల అభ్యర్థులు  31 మార్చి 2021న ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/లో చూడవచ్చు.

PREV
click me!

Recommended Stories

TGPSC Jobs Notification 2026 : తెలుగు యువతకు బంపరాఫర్.. స్టార్టింగే నెలనెలా రూ.54,220 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగం
RBI Recruitment : రూ.18 లక్షల హై శాలరీతో.. ఎగ్జామ్ లేకుండానే రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు పొందే లక్కీ ఛాన్స్