హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్) మలన్జ్ ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో అసిస్టెంట్ ఫోర్‌మెన్, మైనింగ్ మెట్ పోస్టులు ఊన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్) మలన్జ్ ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో అసిస్టెంట్ ఫోర్‌మెన్, మైనింగ్ మెట్ పోస్టులు ఊన్నాయి.
రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.hindustancopper.com/చూడొచ్చు.
ఇందులో ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మైనింగ్)–11, మైనింగ్ మేట్–15.
1. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మైనింగ్)- 11
అర్హత: పదో తరగతి/మైనింగ్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పదో తరగతి అభ్యర్థులకు సంబంధిత పనిలో 6 ఏళ్ల అనుభవం, డిప్లొమా అభ్యర్థులకు మూడేళ్ల అనుభవం తప్పనిసరి ఉండాలి. వాలిడ్ మైన్స్ ఫోర్‌మెన్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది.
వయసు: 01.3.2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
also read
ఎస్‌సి/ఎస్‌టిలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
అర్హత: పదోతరగతి/మైనింగ్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి అభ్యర్థులకు సంబంధిత పనిలో 5 ఏళ్ల అనుభవం, డిప్లొమా అభ్యర్థులకు మూడేళ్ల అనుభవం ఉండాలి. వాలిడ్ మైనింగ్ మేట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి.
వయసు: 01.3.2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎస్‌సి/ఎస్‌టిలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాతపరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులని ట్రేడ్ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు.
రాతపరీక్షలో ఎస్‌సి/ఎస్‌టిలు 35 శాతం, ఇతరులు 40 శాతం కనీస అర్హత మార్కులు సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ట్రేడ్ టెస్ట్‌కి పిలుస్తారు. రాత పరీక్షకు 80 శాతం, ట్రేడ్ టెస్ట్‌కి 20శాతం వెయిటేజి ఉంటుంది. ఈ రెండింట్లో సాధించిన అగ్రిగేట్ మార్కుల ఆధారంగా చివరి ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును ఏజీఎం (అడ్మిని స్ట్రేషన్)–హెచ్‌ఆర్,
హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్, మలాజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్,
టెహసిల్: బిర్‌సా పి.ఓ– మలాజ్‌ఖండ్, జిల్లా– బాలాఘాట్, మధ్యప్రదేశ్– 481116.
దరఖాస్తులకు చివరి తేది: 5 ఏప్రిల్ 2021.
అధికారిక వెబ్‌సైట్: https://www.hindustancopper.com/