సివిల్ సర్వీస్ (మెయిన్స్) ఫలితాలు విడుదల.. రిజల్ట్ తెలుసుకోండిలా..?

By Siva Kodati  |  First Published Mar 23, 2021, 9:55 PM IST

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే సివిల్ సర్వీసెస్-2020 (మెయిన్స్) ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మంగళవారం ప్రకటించింది. ఫలితాలను యూపీఎస్‌సీ తన అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఉంచింది. 2021 జనవరి 8 నుంచి 17 వరకు రాతపరీక్ష నిర్వహించారు.

రాత పరీక్షకు హాజరై, అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌తో పాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ ‘ఏ’ ‘బీ’) ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

Latest Videos

undefined

ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులందరూ 2021 మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో లభించే దరఖాస్తు ఫారంను నింపి సమర్పించాల్సి వుంటుంది.

ఎంపికైన అభ్యర్థుల పర్సనాలిటీ టెస్టులు (ఇంటర్వ్యూలు) త్వరలో ప్రారంభమవుతాయి. ఇవి న్యూఢిల్లీ షాజహాన్ రోడ్ లోని ధోల్పూర్ హౌస్‌లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జరుగుతాయి. మౌఖిక పరీక్షలకు అర్హత సాధించిన వారి కాల్ లెటర్లు యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వుంచారు

click me!