ఇండియన్ సూపర్ లీగ్‌ ఫైనల్ ఫైట్: ముంబై సిటీ వర్సెస్ మోహన్ బగాన్... ఫెవరెట్ ఎవరంటే...

By team telugu  |  First Published Mar 13, 2021, 3:45 PM IST

నేటి సాయంత్రం 7:30 ని.లకు ఫైనల్ మ్యాచ్...

మూడు సార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచిన ఏటీకే మోహన్ బగాన్‌తో ఢీకొడుతున్న ముంబై సిటీ...

ఐఎస్‌ఎల్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై సిటీ...


ISL 2020-21 సీజన్ మూడు నెలల సుదీర్ఘ సీజన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. ఇప్పటిదాకా సీజన్‌లో 114 మ్యాచులు జరగగా, అన్ని జట్లు కలిపి మొత్తంగా 295 గోల్స్ సాధించాయి. ఏడో సీజన్ ఐఎస్‌ఎల్‌ టైటిల్ కోసం ముంబై సిటీ, ఏటీకే మోహన్ బగాన్ మధ్య ఫైనల్ ఫైట్ ఈరోజు రాత్రి 7:30 జరగనుంది. 

సెమీ ఫైనల్‌లో ముంబై సిటీ జట్టు, గోవా ఎఫ్‌సీని పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి ఫైనల్ చేరగా, ఏటీకే మోహన్ బగాన్, నార్త్ ఈస్ట్ యునైటెడ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ముంబై సిటీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కాగా, ఏటీకే మోహన్ బగాన్ డిఫెండింగ్ ఛాంపియన్.

Latest Videos

ఇప్పటికే మూడుసార్లు టైటిల్ గెలిచిన ఏటీకే మోహన్ బగాన్‌కి ముంబై సిటీ ఎలాంటి పోటీ ఇస్తుందా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఫుట్‌బాల్ అభిమానులు. ఒకవేళ ఏటీకే మోహన్ బగాన్ టైటిల్ గెలిస్తే, వరుసగా రెండు సీజన్లు టైటిల్ విన్నర్‌గా నిలిచిన మొదటి జట్టుగా నిలుస్తుంది.

click me!