హైదరాబాద్‌ ఎఫ్‌సీకి షాక్... ఐదో స్థానంతోనే సరి... సెమీస్ చేరిన గోవా ఎఫ్‌సీ...

By team teluguFirst Published Mar 1, 2021, 9:56 AM IST
Highlights

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను డ్రాగా ముగించుకున్న హైదరాబాద్...

సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన గోవా ఎఫ్‌సీ...

ముంబై సిటీ, ఏటీకే మోహన్ బగన్, నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో పాటు...

ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) పోరాటం ముగిసింది. ఏడో సీజన్‌లో హైదరాబాద్ మంచి ప్రదర్శనే ఇచ్చినప్పటికీ, సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పోరాడినా ఫలితం లేకపోయింది.

గోవా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు పూర్తి సమయంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.దాంతో 0-0 స్కోరుతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. హైదరాబాద్ క్లబ్ కంటే రెండు పాయింట్లు ఎక్కువగా ఉన్న గోవా ఎఫ్‌సీ సెమీ-ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

గ్రూప్ స్టేజ్‌లో 20 మ్యాచులు ఆడిన హైదరాబాద్ ఎఫ్‌స జట్టు ఆరు విజయాలు అందుకుని, 11 మ్యాచులు డ్రా చేసుకుంది. మూడు మ్యాచుల్లో ఓడింది. ముంబై సిటీ, ఏటీకే మోహన్ బగాన్, నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో పాటు గోవా ఎఫ్‌సీ జట్లు నాకౌట్‌కి అర్హత సాధించాయి. 

మొదటి సెమీఫైనల్‌లో గోవా ఎఫ్‌సీతో ముంబై సిటీ మార్చి 5న, మార్చి 8న మ్యాచులు ఆడుతాయి. రెండో సెమీ ఫైనల్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్, ఏటీకే మోహన్ బగాన్ మార్చి 6న, మార్చి 9న మ్యాచులు ఆడతాయి. 

click me!