Russia Ukraine Crisis: ర‌ష్యాకు మ‌రో షాకిచ్చిన YouTube.. రష్యన్ స్టేట్-ఫండింగ్ మీడియా ఛానల్స్ బ్లాక్

Published : Mar 12, 2022, 06:19 AM IST
Russia Ukraine Crisis: ర‌ష్యాకు మ‌రో షాకిచ్చిన YouTube..  రష్యన్ స్టేట్-ఫండింగ్ మీడియా ఛానల్స్ బ్లాక్

సారాంశం

Russia Ukraine Crisis: ర‌ష్యాకు YouTube మ‌రో షాక్ ఇచ్చింది. రష్యన్ స్టేట్-ఫండింగ్ చేస్తున్న‌ మీడియా ఛాన‌ల్స్ ను ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ చేస్తున్నట్లు యూట్యూబ్ (YouTube) ప్ర‌క‌టించింది.  ప్రపంచవ్యాప్తంగా ఆ మీడియా ఛానెళ్ల‌ యాక్సెస్‌ను YouTube తక్షణమే బ్లాక్ చేస్తోందని ప్ర‌క‌టించింది. ఈ ఛానెల్స్ లో రష్యా దాడికి సంబంధించిన హింసాత్మక సంఘటనలను ప్రసార‌మ‌య్యాయని, ఆ కార‌ణంతోనే కంటెంట్ పై నిషేధం విధించినట్టు యూట్యూబ్ తెలిపింది.    

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్య చేస్తున్న దండ‌యాత్ర‌ను ప్ర‌పంచ దేశాలు ఖండిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై దాడిని యూట్యూబ్ కూడా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ రష్యన్ స్టేట్-ఫండింగ్ చేస్తున్న‌ మీడియాను బ్లాక్ చేస్తున్నట్లు యూట్యూబ్ (YouTube) ప్ర‌క‌టించింది. ఆ మీడియా ఛానెల్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌  యాక్సెస్‌ను YouTube తక్షణమే బ్లాక్ చేస్తోందని ప్ర‌క‌టించింది. ఈ ఛానెల్స్ లో రష్యా దాడికి సంబంధించిన హింసాత్మక సంఘటనలను ప్రసార‌మ‌య్యాయని, ఆ కార‌ణంతోనే కంటెంట్ పై నిషేధం  విధించినట్టు  యూట్యూబ్ తెలిపింది.  

 YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలు ఆధారంగా కంటెంట్‌ను తిరస్కరించడం లేదా త‌గ్గించ‌డం  చేయ‌వ‌చ్చ‌నీ, YouTubeలో హింసాత్మక సంఘటనల‌పై పూర్తి నిషేధం ఉంద‌నీ, ఈ మార్గద‌ర్శ‌కాల‌న‌వు  ఉల్లంఘించే విధంగా ఉన్న‌ ఉక్రెయిన్‌లో రష్యా దాడికి సంబంధించిన కంటెంట్‌ను  తీసివేశామ‌ని  YouTube ప్రతినిధి ఫర్షాద్ షాడ్లూ చెప్పారు. దానికి అనుగుణంగా, తక్షణమే అమలులోకి వస్తుంది, మేము ప్రపంచవ్యాప్తంగా రష్యన్ ప్రభుత్వ-నిధులతో ప‌ని చేస్తున్న YouTube ఛానెల్‌లను కూడా బ్లాక్ చేస్తున్నామని తెలిపారు. 

ఇదిలాఉంటే.. గ‌త రెండు రోజుల క్రితం.. రష్యాలో గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ పేమెంట్స్ ఆధారిత అన్ని సేవలను నిలిపివేశాయి.అల్ఫాబెట్ సంస్థకు చెందిన గూగుల్ ప్లే, యూట్యూబ్.. రష్యాలో పేమెంట్ ఆధారిత సేవలను నిలిపివేశాయి.  ఈ చ‌ర్య‌తో రష్యాలోని ప్రజలు ఆండ్రాయిడ్స్ యాప్స్, గేమ్స్ కొనుగోలు చేయ‌లేరు. అలాగే.. ఇన్ యాప్‌ పర్చేజెస్ కూడా చేయలేరు. యాప్స్‌ను కొత్తగా సబ్‌స్క్రైబ్ లేదా రెన్యువల్ చేసుకోలేరు. అలాగే యూట్యూబ్ ప్రీమియమ్‌ను కూడా..  రష్యన్లు కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకోలేరు. 

రష్యాలోని యూట్యూబ్ యూజర్లకు ప్రీమియమ్, చానెల్ మెంబర్‌షిప్స్, సూపర్ చాట్, మర్చండైజ్ సేవలు నిలిపివేస్తునట్టు యూట్యూబ్ ప్రకటించింది. అయితే యూట్యూబ్ ఉచిత సర్వీసులను రష్య‌న్ వాసులు వినియోగించుకోవచ్చు. అలాగే రష్యా వెలుపల ఉన్న వ్యూవర్స్ నుంచి ఆదాయాన్ని కూడా రష్యా చానెళ్లు పొందగలవు.

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు వ్య‌తిరేఖిస్తూ.. అమెరికాతో పాటు ప‌లు దేశాలు, భారీ టెక్ సంస్థలు ఆంక్షలు విధిస్తున్న విష‌యం తెలిసిందే..  అలాగే మైక్రోసాఫ్ట్, యాపిల్, సామ్‌సంగ్‌ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు కూడా రష్యాలో కార్యకలాపాలు నిలిపివేశాయి. వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లాంటి ఆర్థిక సంస్థలు కూడా రష్యాలో సర్వీసులు ఆపేశాయి. దీని ద్వారా ఈ సంస్థలకు సంబంధించిన కార్డు ట్రాన్సాక్షన్‌లకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ దేశంలో టెక్ సంస్థల పేమెంట్ ఆధారిత సేవలకు కూడా ఇబ్బందే. ఈ నేపథ్యంలో యూట్యూబ్, గూగుల్ ప్లే కూడా చెల్లింపుల ఆధారిత సేవలను నిలిపివేశాయి.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే