
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడుల చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని పలు ప్రయోగశాలలలో ఉన్న మానవాళికి అధికముప్పు కలిగించే ప్రమాదముందనీ, వ్యాధికారక క్రిములను నాశనం చేయాలని డబ్ల్యూహెచ్ఓ ఉక్రెయిన్ ను ఆదేశించింది. రష్యా సైనిక దాడుల్లో ఆ ల్యాబ్‌లు ధ్వంసమయ్యే అవకాశాలున్నాయనీ, పెను విధ్వంసానికి దారితీస్తుందని, దానిని నిరోధించేందుకే ఈ హెచ్చరికలు చేసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ క్రిముల వల్ల ప్రజానీకం తీవ్ర అనారోగ్యానికి గురవుతారని తెలిపింది.
ఈ తరుణంలో ఉక్రెయిన్ పై రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ దేశాలపై జీవ యుద్ధాన్ని (బయో వార్ )చేయడానికి అమెరికా, ఉక్రెయిన్ ప్రయత్నించాయనీ, గబ్బిలాలపై పరిశోధనలు చేశాయని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సమావేశం అయింది. ఈ సమావేశంలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా.. ఉక్రెయిన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌లో బయోలాజికల్ వెపన్స్ పై పరిశోధనకు వాషింగ్టన్ నిధులు సమకూర్చిందని, గతంలో చేసిన ఆరోపణలను రష్యా మరోసారి పునరావృతం చేసింది.
UNలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ రాజధాని కైవ్ లో ఉన్న పలు ప్రయోగాల శాలలో.. గబ్బిలాల నుండి ప్రజలకు వ్యాపించే అనేక "పాథోజెన్ ల్యాబ్" ల్లో ఉన్నాయనీ, ప్రపంచ మానవాళి నష్టం కలిగించేలా చాలా ప్రమాదకరమైన జీవ ప్రయోగాలు చేశారనీ, ఇందుకోసం ప్రయోగంగా చేస్తూ 30 ల్యాబ్ లను నిర్మించారని రష్య రాయబారి ఆరోపించారు. ఈ ప్రమాదకర వ్యాధికారకాల వల్ల ప్లేగు, ఆంత్రాక్స్, కలరా వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆరోపించారు. రష్యన్ భాషలో ఎటువంటి ఆధారాలు అందించకుండా నెబెంజియా చెప్పారు.
రష్యా వాదనలను ఐక్యరాజ్య సమితి తోసిపుచ్చింది. UN నిరాయుధీకరణ వ్యవహారాల అండర్ సెక్రటరీ-జనరల్ Izumi Nakamitsu మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఏదైనా జీవ ఆయుధాల కార్యక్రమం గురించి తెలియదు" అని సమావేశంలో చెప్పారు. వాషింగ్టన్, కైవ్ ల్లో జీవ ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించిన ప్రయోగశాలల ఉనికిని తిరస్కరించారు.
అనంతరం UNలోని బ్రిటీష్ రాయబారి బార్బరా వుడ్‌వర్డ్ మాట్లాడుతూ.. రష్యా భద్రతా మండలి పూర్తిగా అటవికమైన, పూర్తిగా నిరాధారమైన, బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తుందనీ, ఉక్రెయిన్ ఆక్రమణకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. రష్యా ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమనీ, ఉక్రెయిన్‌లో జీవ ఆయుధాల కార్యక్రమం ఉందని నమ్మదగిన సాక్ష్యాలు ఏవీ లేవని తేల్చి చెప్పారు. కోవిడ్-19 వంటి వ్యాధులను గుర్తించే ప్రజారోగ్య సదుపాయాలను ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం చేసిందని UNలో యునైటెడ్ స్టేట్స్ రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ అన్నారు.
థామస్-గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. అబద్ధం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతోనే రష్యా ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో తన స్వంత రసాయన ఆయుధాలను ఉపయోగించినందుకు "తప్పుడు జెండా ప్రయత్నం"లో భాగంగా రష్యా సెషన్‌కు పిలుపునిచ్చినందుకు యునైటెడ్ స్టేట్స్ తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు.
2018లో యునైటెడ్ స్టేట్స్ జార్జియాలోని ఒక ప్రయోగశాలలో రహస్యంగా జీవ ఆయుధాల ప్రయోగాలు చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మరోసారి పునరావృతం చేశారు. ఉక్రెయిన్ లాగా, NATO, యూరోపియన్ యూనియన్ పలు సార్లు రష్యా ఆరోపణలుచేసింది. ఉక్రెయిన్‌లో జీవ ఆయుధాల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలకు అమెరికా నిధులు సమకూరుస్తోందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఆరోపించింది.