ప్రియురాలితో ఉంటూనే ఆమె తల్లితో సైడ్ ట్రాక్.. బిడ్డ పుట్టగానే అత్తతో జంప్

By Siva KodatiFirst Published Feb 18, 2021, 5:56 PM IST
Highlights

మన చుట్టూ అప్పుడప్పుడు కొన్ని వింత సంగఘటనలు జరుగుతూ వుంటాయి. వాటిని చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. తాజాగా ఓ వ్యక్తి తన ప్రియురాలిని కాదని, ఆమె తల్లితో జంప్ అయ్యాడు.

మన చుట్టూ అప్పుడప్పుడు కొన్ని వింత సంగఘటనలు జరుగుతూ వుంటాయి. వాటిని చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. తాజాగా ఓ వ్యక్తి తన ప్రియురాలిని కాదని, ఆమె తల్లితో జంప్ అయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని గ్లౌస్‌స్టర్‌షైన్‌కు చెందిన జెస్‌ అల్‌డ్రిడ్జ్‌ (24), అదే ప్రాంతానికి చెందిన రియాన్‌ షెల్టన్‌ (29)తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. అయితే అల్‌డ్రిడ్జ్ రియాన్‌తో పాటు 44 ఏళ్ల వయసున్న జార్జినాతోనూ ఎఫైర్ నడిపాడు.

రాత్రిళ్లు కిచెన్‌లో బకార్డి తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. వీరి ప్రవర్తనపై రియాన్‌కు ముందుగానే అనుమానం వచ్చింది. దీంతో ఓ రోజు దీనిపై ఇద్దర్నీ నిలదీయగా.. అలాంటిదేమీ లేదని బుకాయించారు.

తీరా రియాన్‌ కడుపుతో ఉన్న సమయంలో జెస్‌, జార్జినాలు రహస్యంగా కలుసుకునేవారు. కానీ ఈ విషయం రియాన్‌కు తెలిసినా ఏమీ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో జనవరి 28న జెస్‌, రియాన్‌ల ప్రేమకు గుర్తుగా పండంటి మగబిడ్డ జన్మించాడు.

ఈ సంతోషం పోవడానికి ఎంతో సేపు పట్టలేదు. బిడ్డ పుట్టిన కొన్ని గంటల తర్వాత జెస్‌ నుంచి రియాన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఇక నుంచి ఇద్దరం విడిపోదామన్నది దాని సారాంశం. ఎలాగో బాధను దిగమింగుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన ఆమెకు.. జెస్‌, తల్లి జార్జినా లేచిపోయారన్న విషయం తెలిసి షాక్‌ అయింది.

దీనిపై రియాన్‌ మాట్లాడుతూ.. ఇది దారుణమైన వెన్నుపోటని ఏ అమ్మమ్మ అయినా మనవడితో ప్రేమలో పడాలి.. మనవడి తండ్రితో కాదంటూ మండిపడింది. తనకు, తన పిల్లలకు తోడుగా అమ్మ ఉంటుందనుకున్నాను. కానీ, ఇలా నా ప్రియుడితోనే జంపవుతుందని అనుకోలేదని రియాన్ కన్నీటిపర్యంతమైంది. 

click me!