కరోనా విలయతాండవం..37లక్షలు దాటిన కేసులు

By telugu news team  |  First Published May 6, 2020, 2:27 PM IST

వాళ ప్రపంచవ్యాప్తంగా 155 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 2,52,396 మంది మరణించారు.
 


ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 37 లక్షలు దాటింది. 12 లక్షల మందికిపైగా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. 

అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా బుధవారం గత 24 గంటల్లో 2,268 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు మొత్తం 37,26,666 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 155 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 2,52,396 మంది మరణించారు.

Latest Videos

undefined

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 24,713 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,12,835 ఉండగా, గత 24 గంటల్లో 1.324 మంది మరణించారు. 

అలాగే ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 69,921 మంది మృతిచెందారు. ఇక స్పెయిన్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటి వరకు స్పెయిన్‌లో మొత్తం 2,45,567 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు.

 మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 25,100 మంది చనిపోయారు. ఇటలీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇటలీలో మొత్తం 2,09,328 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా ఇటలీలో ఇప్పటి వరకు 28,710 మంది చనిపోయారు.

click me!