కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టామన్న ఇటలీ: త్వరలో మనుషులపై ప్రయోగం

By telugu teamFirst Published May 6, 2020, 8:57 AM IST
Highlights

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టామని ఇటలీకి చెందిన ఓ సంస్థ ప్రకటించింది. ఎలుకలపై దాన్ని ప్రయోగించామని, మంచి ఫలితాలు వచ్చాయని, ఈ వేసవి తర్వాత మనుషులపై ప్రయోగిస్తామని చెబుతోంది.

మెక్సికో: కరోనా వైరస్ ను అదుపు చేయడానికి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఇటలీ శాస్త్రవేత్తలు చెబుతుున్నారు. కోవిడ్ -19ను ఎదుర్కోవడానికి ప్రపంచమంతా సమరం సాగిస్తున్న వేళ కరోనా వైరస్ కాంటాక్టును తగ్గించడానికి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఇటలీకి చెందన న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఎస్ఏ తెలిపింది. 

టకీస్ అనే సంస్థ కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఆ సంస్థ తెలిపింది. దాన్ని ఎలుక యాంటీ బాడీస్ నుంచి తయారు చేసినట్లు, అది మనుషులపై పనిచేయనున్నట్లు చెబుతున్నారు. దాన్ని రోమ్ లోని స్పల్లాజాని ఆస్పత్రిలో పరీక్షించినట్లు తెలిపింది. దాన్ని ఈ వేసవి తర్వాత మనుషులపై ప్రయోగించి చూడనున్నట్లు టకీస్ సీఈవో లుయిగి ఔరిసిఛియో చెప్పారు. 

వ్యాక్సిన్ ను పరీక్షించడానికి ఎలుకపై ప్రయోగించారని, ఎలుక యాంటీ బాడీస్ ను డెవలప్ చేసిందని, అది మానవ కణాలకు వైరస్ సోకకుండా అది నిరోధించగలిగిందని అన్నారు. 

ఐదు వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ను పరిశీలిచంగా పెద్ద యెత్తున యాంటీ బాడీస్ ను సృష్టించాయని, ఉత్తమ ఫలితాలు ఇచ్చే రెండింటిని పరిశోధకులు ఎంపిక చేసుకున్నారని అంటున్ారు. 

click me!