
అమెరికా : ఓ చిన్నారిని బొమ్మలాగా పైకీ, కిందికి ఎగరేస్తూ... చిత్రహింసలకు గురి చేశారు ఇద్దరు మహిళలు. మద్యం మత్తులో బార్ బయటే ఈ దారుణానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఆ మహిళలిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
యునైటెడ్ స్టేట్స్‌లోని డేటోనా బీచ్ బార్ వెలుపల మద్యం మత్తులో ఓ పసికందును "బొమ్మలాగా" అటూ ఇటూ విసిరినందుకు ఇద్దరు మహిళలు అరెస్టయ్యారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, బ్రియానా లాఫో, (19), సియెర్రా న్యూవెల్ (20) అనే ఇద్దరు గత వారం అరెస్టు అయ్యారు. వీరిద్దరిపై చైల్డ్ అబ్యూజ్ కింద కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అఫిడవిట్ ప్రకారం లాఫోమీద మరో కేసుకూడా ఉన్నట్లు తెలుస్తోంది.
చారిత్రాత్మక ఘట్టాలకు సజీవ సాక్ష్యం: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఖర్గే
డేటోనా బీచ్‌లోని సీబ్రీజ్ బౌలేవార్డ్‌లోని కొయెట్ అగ్లీ సెలూన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు శిశువును గాలిలోకి విసిరి, తలక్రిందులుగా చేసి ఆడుకున్నారు. చిన్నారిని 4 అడుగుల దూరం నుండి ముందుకు, వెనుకకు విసిరేస్తూ రాక్షసానందం పొందారు. దీని మీద పోలీసులు స్పందించారు.
ఈ సంఘటనను ఒక ప్రత్యక్స సాక్షి వీడియో తీశాడు. అతను చెప్పిన దాని ప్రకారం... అతను వీడియో తీస్తుంటే.. లాఫో చిన్నారి తన చీలమండల దగ్గర పట్టుకుని అతడి దగ్గరికి వచ్చింది. ఆ వీడియో రికార్డ్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో న్యూవెల్ క్రచెస్ పట్టుకుని చుట్టుపక్కల వారిని కొడతానని బెదిరింపులకు దిగింది.
ఫుటేజ్‌లో కనిపించిన దాని ప్రకారం.. ఒక సమయంలో, 20 ఏళ్ల యువతి శిశువును చాలా స్పీడ్ గా పైకి క్రిందికి ఊపుతున్నట్లు కూడా కనిపించింది. లాఫో శిశువును తలక్రిందులుగా పట్టుకొని కాంక్రీటుపై పడేస్థానని భయపెడుతూ షేక్ చేయడం కనిపించిందని పోలీసులు పేర్కొన్నారు.
లాఫో, న్యూవెల్ 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.. సంఘటన సమయంలో ఇద్దరూ మత్తులో ఉన్నారని పోలీసుల నివేదిక పేర్కొంది. ఫాక్స్ న్యూస్ ప్రకారం, శిశువు వెనుక భాగంలో ఎర్రటి గాయాలయ్యాయి. శిశువును స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్-రేలో శిశువు చేయి విరిగినట్లు సూచించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత చిన్నారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.
అయితే, ఆ శిశువు ఈ ఇద్దరు మహిళలు ఏమవుతారు. వారిమధ్య సంబంధం ఏంటి అనే విషయం వెల్లడించలేదు. ఇద్దరు మహిళలను ఎలాంటి బాండ్ లేకుండా నిర్బంధిస్తున్నామని పోలీసులు తెలిపారు.