మరో అమ్మాయితో బాయ్ ఫ్రెండ్ జల్సా.. టెక్నాలజీ సాయంతో పట్టుకుని దుమ్ము దులిపేసిన యువతి..

By AN TeluguFirst Published Oct 7, 2021, 8:22 AM IST
Highlights

ఓ యువతి  తన ప్రియుడిమీద అనుమానంతో ఎవరూ అనుకోని విధంగా లేడీ డిటెక్టివ్ అవతారం ఎత్తింది. అతనెక్కడున్నాడో తెలుసుకోవడానికి టెక్నాలజీని తెలివిగా వాడింది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్ కి వివరిస్తూ తీసిన వీడియో ఇప్పుడు TikTok లో యమ వైరల్ అవుతోంది. 

మీరు ప్రేమిస్తున్నవారు మీ పట్ల నిజాయితీగా లేరని మీకు అనిపిస్తే.. ఆ నిజం తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారు? చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని ఏం అనుకుంటారోనని భయం. మరికొంతమంది తమకు కావాల్సిన వాళ్లు ఇలా చేస్తారని అనుమానం వస్తే ముందుగా ఆ వ్యక్తి ఫోన్ చెక్ చేస్తారు.

అతని మెసేజెస్, సోషల్ మీడియాను చెక్ చేస్తారు. కానీ ఓ యువతి అయితే ఎంతో సాహసం చేసింది. తన ప్రియుడిమీద అనుమానంతో ఎవరూ అనుకోని విధంగా లేడీ డిటెక్టివ్ అవతారం ఎత్తింది. అతనెక్కడున్నాడో తెలుసుకోవడానికి టెక్నాలజీని తెలివిగా వాడింది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్ కి వివరిస్తూ తీసిన వీడియో ఇప్పుడు TikTok లో యమ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆ వీడియోకి దాదాపు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. 

స్టెఫ్ కి ఒక boy friend  ఉన్నాడు. అతడు మరో అమ్మాయితో తిరుగుతూ తనను cheat చేస్తున్నాడని ఆమెకు అనిపించింది. ఆమె తన doubt తీర్చుకునేందుకు instagramలోని లొకేషన్ టూల్ ని ఉపయోగించింది. తన బాయ్ ఫ్రెండ్ పోస్ట్ చేసే ఫొటోల లొకేషన్లను Instagram Location Tagతో స్టెఫ్ పరిశీలించింది. అలా ఫొటోలను పరిశీలిస్తూ.. ఆ ఫొటోలు ట్యాగ్ చేసిన ప్రతి అమ్మాయిల కోసం వెతికింది. 

పాకిస్తాన్ ను కుదిపేసిన భూకంపం: 20 మంది మృతి, వందలాది మందికి గాయాలు

ఒక్కసారి అందులో tag చేసిన అమ్మాయి అడ్రస్ తెలుసుకుని వారు తమ గురించి చెప్పే స్టోరీస్ ను స్టెఫ్ screen record చేసింది. అలా రికార్డ్ చేసిన వాటిని మళ్లీ బాగా పరిశీలించగా తన బాయ్ ఫ్రెండ్ ఎవరితో ఉన్నాడో వారి మాటలను బట్టి పసిగట్టింది. 

ఇలా కూడా ఒక చీటర్ బాయ్ ఫ్రెండ్ ను పట్టుకోవచ్చా.. అని netizens స్టెఫ్ ను పొగుడుతున్నారు. స్టెఫ్ ఒక జీనియస్ అని ఒక యూజర్ అన్నాడు. కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం స్టెఫ్ ఒక సైకో అని తను ఇంతలా అన్వేషిస్తుందని ఊహించలేకపోయానని చెబుతున్నాడు. 

click me!