
లాహోర్ : Pakistanలోని పంజాబ్ ప్రావిన్స్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతి తన కెరీర్ గా Dancing, Modellingఎంచుకుందని తోడబుట్టిన వాడే కాల్చి చంపేశారు. లాహోర్ కు 130 కిలోమీటర్ల దూరంలోని రెనాలా ఖుర్ద్ ఒకారా అనే ప్రాంతంలో జరిగిన ఈ honour killingకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్రా అనే యువతి తన కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా స్థానిక క్లాతింగ్ బ్రాండ్ కు మోడలింగ్ గా, హైదరాబాద్ నగరంలోని థియేటర్స్ లో డాన్సర్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ వృత్తి తమ కుటుంబ సంప్రదాయానికి విరుద్ధం అని.. వదిలేయమని ఎంతగానో ఒత్తిడి చేశారు. అయితే, ఇష్టంగా ఎంచుకున్న వృత్తిని వదిలేందుకు సిద్రా ససేమిరా అంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈద్ వేడుకలు తమ కుటుంబసభ్యులతో జరుపుకునేందుకు ఫైసలాబాద్ నగరం నుంచి స్వగ్రామానికి వచ్చింది.
యువతి ఎంచుకున్న వృత్తిలో మర్యాదకు సంబంధించిన విషయంలో తల్లిదండ్రులు, సోదరుడు ఆమెతో గురువారం గొడవ పడ్డారు. తన కెరీర్ ను వదులుకోనని తేల్చిచెప్పడంతో ఆమెను కొట్టారని పోలీసులు తెలిపారు. ఆ మరుసటి రోజు హమ్జా కోపంతో తన సోదరి పై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. యువతి సోదరుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతడు నేరం అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఫ్రాజ్ హమీద్ అనే అధికారి మాట్లాడుతూ... ఎవరో బంధువులు తన సోదరి డాన్స్ వీడియోని పంపడంతో అది చూసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ కోపంతోనే తన సోదరిని కాల్చి చంపేసినట్లు హమ్జా కూడా చెప్పారన్నారు.
ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితం తెలంగాణలోకి హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. telangana రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్ లో జరిగిన honour killing కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు తన భర్తపై దాడి చేసి.. తలపై కొట్టి చంపారని హతుడి భార్య ఆరోపిస్తున్నారు. నడిరోడ్డుపై Iron rods తో కొట్టి చంపారని చెప్పారు. చావైనా బ్రతుకైనా నీతోనే అని తన భర్తతో చెప్పినట్లు ఆమె తెలిపారు. ఐదుగురిలో ఒకతను తనను దొబ్బేస్తున్నాడని, ఇతరులు తనపై attack చేశారని ఆమె చెప్పారు. కొద్ది రోజుల క్రితం ప్రేమవివాహం చేసుకున్న జంటపై ఐదుగురు వ్యక్తులు సరూర్ నగర్ చెరువుకట్ట వద్ద దాడి చేశారు.
పదేళ్లుగా నాగరాజుతో తనకు పరిచయం ఉందని ఆయన భార్య అశ్రిన్ చెప్పారు. తనను పెళ్లి చేసుకుంటే చంపుతారని నాగరాజుకు తెలుసునని, అయినా పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పారు. తన భర్త నాగరాజుతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తుంటే తనను బైక్ నుంచి పడేసి దాడి చేశారని ఆమె చెప్పారు. దాడి జరుగుతుంటే ఎవరూ కాపాడడానికి ముందుకు రాలేదని, కాళ్లు పట్టుకుని అందరినీ వేడుకున్నానని ఆమె చెప్పారు. పెళ్లి చేసుకుంటే చంపుతారని మూడు నెలల పాటు తాను నాగరాజుకు దూరంగా ఉన్నానని, చివరికి అంగీకరించి పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పారు.