లక్షన్నర ఐఫోన్ ఆర్డర్ చేస్తే... హ్యాండ్ సోప్..యూకేలో మహిళకు షాక్...

Published : Feb 08, 2022, 10:29 AM IST
లక్షన్నర ఐఫోన్ ఆర్డర్ చేస్తే... హ్యాండ్ సోప్..యూకేలో మహిళకు షాక్...

సారాంశం

ఆపిల్ పళ్లు ఆర్డర్ చేస్తే ఐ ఫోన్ వస్తే సంతోషంగానే ఉంటుంది. కానీ ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే హ్యండ్ వాష్ వస్తే... అలాంటి ఘటనే జరిగింది యూకేలో.. ఓ మహిళ లక్షన్నర విలువైన ఐఫోన్ ఆర్డర్ చేసింది. కానీ పార్శిల్ లో ఆమెకు డాలర్ విలువ చేసే హ్యాండ్ వాష్ రీఫిల్ ప్యాక్ రావడంతో షాక్ అయ్యింది.

యూకే : ఆపిల్ ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే హ్యాండ్ సోప్ వచ్చిన ఘటన యూకేలో జరిగింది. ఓ మహిళ అత్యంత ఖరీదైన ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేసింది. అయితే దానికి బదులు ఆమెకు ఒక డాలర్ విలువ చేసే చేతి సబ్బు పార్శిల్ లో వచ్చింది. ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. గతంలోనూ జరిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇవి చాలా అరుదుగా జరిగే ఘటనలే అయినా ఆన్ లైన్ షాపింగ్ మీద, ఆర్డర్ల మీద విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి. 

కొన్ని నెలల క్రితం, కేరళ లోని ఓ వ్యక్తి Apple iPhone 12ని ఆర్డర్ చేస్తే, దీనికి బదులుగా డిష్ వాషింగ్ సబ్బు, 5 రూపాయల బిళ్ల ప్యాకేజ్ లో వచ్చాయి. సరిగ్గా ఇలాంటి అనుభవమే UKలోని ఒక మహిళ విషయంలో కూడా జరిగింది.

Khaoula Lafhaily అనే మహిళ లోకల్ గా ఉన్న ఓ ప్రముఖ క్యారియర్ ద్వారా iPhone 13 Pro Maxని ఆర్డర్ చేసింది. కొద్ది రోజుల తరువాత అది డెలివరీ అయ్యింది. అందులో వచ్చిన వస్తువులు చూసి ఆమె షాక్ అయ్యింది. ఆ మహిళ ఆర్డర్ చేసిన iPhone 13 Pro Maxకి బదులుగా $1 విలువైన హ్యాండ్ సోప్ రీఫిల్ బాటిల్‌ అందులో వచ్చింది.

డెలివరీ సమయంలో మోసం జరిగి ఉండవచ్చని AppleInsider నివేదిక తెలుపుతోంది. ఆమె SkyMobile ద్వారా 36 నెలల ఒప్పందంపై ఈ ఫోన్ ను కొనుగోలు చేసింది. ఫోన్ మొత్తాన్నిముందుగానే చెల్లించింది. దాని ధర GBP 1,500 (దాదాపు రూ. 1.5 లక్షలు). ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ. 1,29,900కి అమ్ముతున్నారు.

ఫోన్ కొనే సమయంలో ఆమె.. నెక్ట్స్ డే డెలివరీ పెట్టింది. కానీ, డెలివరీ సిబ్బంది ఆమెకు కాల్ చేసి తను ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడని.. కాబట్టి నిర్ణీత తేదీకి డెలివరీ చేయడం సాధ్యం కాదని చెప్పుకొచ్చాడు. అలా రెండు రోజుల తరువాత ఫోన్ డెలివరీ అయ్యింది. అయితే డెలివరీ చేసే వ్యక్తి రెండోసారి ఆమె ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్యాకేజీని డెలివరీ చేయలేదు. మూసి ఉన్న తలుపులు ఫొటో తీసి ఇంట్లో ఎవరూ లేరని పేర్కొంటూ కంపెనీకి మెసేజ్ పంపాడు. అయితే, ఆ సమయంలో లఫహైలీ ఇంట్లోనే ఉంది. డెలివరీ బాయ్ తలుపు కొట్టకుండానే ‘డోర్ లాక్’ అని చెప్పి వెళ్లిపోయాడని ఆమె పేర్కొంది.

ఆ తర్వాతి రోజు డెలివరీ బాక్సు అందుకుంది. అందులో ఐఫోన్‌కు బదులు హ్యాండ్ సోప్ రీఫిల్ బాటిల్ రావడం చూసి ఆశ్చర్యపోయింది. దీంతో ఆమె స్కైమొబైల్‌కు ఫిర్యాదు చేసింది. స్థానిక క్యారియర్ ఈ విషయాన్ని కంపెనీ దర్యాప్తు చేస్తుందని తెలిపింది. అయితే క్యారియర్ ఇంకా ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో సదరు మహిళ రిప్లై కోసం ఎదురు చూస్తోంది. డెలివరీ వ్యక్తి తప్పు అని, డబ్బులకు ఆశపడి ఈ దొంగతనంచేసి ఉండవచ్చని ఈ మొత్తం ఘటన సూచిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !