చైనాలో మళ్ళీ లాక్‌డౌన్: నగరంలోని అక్కడి 35 లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం..

By asianet news teluguFirst Published Feb 8, 2022, 1:26 AM IST
Highlights

చైనా ఇప్పటికీ స్థిరమైన జీరో-కోవిడ్ విధానానికి కట్టుబడి ఉన్న ఏకైక ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున కరోనా వ్యాప్తిపై చాలా అప్రమత్తంగా ఉంది.
 

వియత్నాం సమీపంలో 3.5 మిలియన్ల జనాభా ఉన్న నగరంలో చైనా కఠినమైన లాక్‌డౌన్ విధించింది. మూడు రోజుల్లో 70కి పైగా కరోనా కేసులు నమోదవడంతో చైనా ఈ చర్య తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఉన్నప్పటికీ జీరో కోవిడ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తోంది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 

వియత్నాం సరిహద్దు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న  బైస్(Baise)పై పూర్తి నిషేధం ప్రకటించింది. గత శుక్రవారం ఇక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. ఒక ప్రయాణికుడు న్యూ ఇయర్ హాలిడే జరుపుకుని ఇంటికి తిరిగి వచ్చాడు, అయితే అతనికి కరోనా సోకింది దీంతో కఠినత్వాన్ని పెంచారు. గ్వాంగ్జీ  బైస్ నగరంలోని అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి వారు ఎవరూ నగరం విడిచి వెళ్ళడానికి అనుమతించబడదని ఆదివారం ప్రకటించింది, అలాగే చాలా జిల్లాలలో ప్రజలు ఇళ్లలో ఉంటున్నారు. వైస్ మేయర్ ప్రకారం, నగరంలోకి లేదా బయటికి వాహనాలు కూడా రాలేవు. అనవసర కదలికలను ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. అక్కడి ప్రజలకు సామూహిక కరోనా పరీక్షలు జరుగుతున్నాయని అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది. 

దక్షిణ సరిహద్దులో ముట్టడి
కరోనా మహమ్మారి సమయంలో చైనా దక్షిణ సరిహద్దును చుట్టుముట్టింది. తద్వారా వియత్నాం, మయన్మార్‌ల నుంచి అక్రమ వలసదారులు వారి సరిహద్దుల్లోకి ప్రవేశించలేరు. అలాగే వారి నుంచి వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఇన్‌ఫెక్షన్‌న్లను కూడా అరికడుతుంది.

కఠినమైన చర్యలు, మరణాలు
రెండేళ్ల కిందటే చైనాలోని వుహాన్‌లోని హుబేలో కరోనా మహమ్మారి వ్యాపించినప్పుడు కఠినమైన చర్యలు తీసుకున్నారు. కఠినమైన లాక్ డౌన్, మాస్ టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ద్వారా కరోనా వ్యాప్తిని ఆపడానికి చైనా ప్రయత్నించింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కరోనా మరణాలు నమోదైతే, ఆ సమయంలో చైనాలో మాత్రం మరణాలు తగ్గాయి.

జియాన్‌లో 13 మిలియన్ల మంది
డెల్టా అండ్ ఓమిక్రాన్ కేసుల వ్యాప్తి తర్వాత లక్షలాది మంది ప్రజలు ఒలింపిక్స్‌ను వీక్షిస్తు వారి ఇళ్లకె పరిమితం చేయబడింది. ఒక నెలలో 2 వేలకు పైగా కరోనా కేసులు వ్యాపించిన తరువాత, జియాన్ నగరంలోని 13 మిలియన్ల మంది ప్రజలు డిసెంబర్‌లో తమ ఇళ్లలో ఉండిపోయారు. చాలా కాలంగా ఇళ్లలో ఖైదు చేయబడిన ప్రజలు కఠినమైన లాక్ డౌన్ కారణంగా కూరగాయల కొరత గురించి ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలోని సీరియస్ పేషెంట్లకు చికిత్స అందకుండా అడ్డుకున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మరణాలు నమోదయ్యాయి.

చైనాలోని అన్ని సరిహద్దులు 
సోమవారం 79 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్వాంగ్జీ నుండి 37 కేసులు నమోదయ్యాయి. అలాగే గత వారం చివరిలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు బయటపడిన తర్వాత హాంకాంగ్  జీరో కోవిడ్ విధానంపై ప్రశ్నలు తలెత్తాయి. దీంతో అధికారులు కరోనా పరీక్షలను పెంచి, ఇన్‌ఫెక్షన్‌ నివారణకు కొత్త మార్గాలను అనుసరించాల్సి ఉంది. చైనా హాంకాంగ్‌తో సహా  అన్నీ సరిహద్దులను మూసివేసింది. 
 

click me!